శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరి.. రాజకీయ సంక్షోభంగా మార్పు.. సాక్షాత్తు దేశ అధ్యక్షుడే పరారీ. జపాన్ లో దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత, మాజీ ప్రధాని నడిరోడ్డుపై కాల్చివేత..పాకిస్థాన్ లో రెండు నెలల కిందటే ప్రధాని పదవిని వదులుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్.. సైనిక చర్య పేరిట ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ.. రెండేళ్లుగా నలుగుతూ ఉన్నట్లుండి ముసిరిన వివాదాలతో వైదొలగిన బ్రిటన్ ప్రధాని.. తుపాకీ కాల్పుల మోత నడుమ అమెరికాలో అబార్షన్ హక్కు పునరుద్ధరణతో అలజడులు.. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమైక్రాన్ వేరియంట్ చైనాలో కరోనా తిరగబెడుతుందా? అన్నంతగా ఆందోళన.. ఇలా ఒకటేమిటి..? ప్రపంచంలోని ప్రతి మూలన ఏదో ఒక దేశంలోనూ వివాదాలే. అన్నీ అటుఇటుగా ఏకకాకలంలో పుట్టినవే.ఆశ్చర్యకరంగా ఇవన్నీ మిగతా ప్రపంచానికీ ఆసక్తికరంగా మారాయి. ఇవన్నీ 2022లోనే జరుగుతుండడం గమనార్హం.
దక్షిణాఫ్రికాతో మొదలై...ఆఫ్రికా ఖండంలో గతేడాది చివర్లో మొదలైన కరోనా వేరియంట్ ఒమైక్రాన్ ఉద్భవం 2022 ప్రారంభాన్ని వణికించింది. వ్యాప్తి రీత్యా అత్యంత వేగవంతమైన ఆ వేరియంట్ ధాటికి అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదకారి కాకపోవడంతో వ్యాప్తితోనే సరిపోయింది. ఫిబ్రవరి నాటికి దీని తీవ్రత తగ్గింది. కాగా, ఇంతలోనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య అంటూ కాలుదువ్వింది. ఈ దురాక్రమణ ఐదు నెలలుగా కొనసాగుతోంది. ఇంతకూ తేలడం లేదు.
గోగో గొట అంటే.. బోరిస్ కు సెగ తగిలింది బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ శకం ముగియనుంది. ఆయన పదవిలోకి వచ్చింది మొదలు కొవిడ్ ఆయనతో ఆటలాడుకుంది. రెండేళ్ల కిందట బోరిస్ స్వయంగా కొవిడ్ తో ఐసీయూలోకి వెళ్లారు. తర్వాత కోలుకుని వచ్చారు. అయితే, కొవిడ్ సమయంలో, బ్రిటన్ రాణి భర్త చనిపోయిన సందర్భంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఇటీవల చేపట్టిన ఓ నియామకం మరింత చిక్కుల్లో పడేసింది. దీంతో ఏకంగా పదవికే ముప్పు ఏర్పడింది. ఇక శ్రీలంక విషయానికొస్తే నాలుగు దశాబ్దాలుగా ఏదో ఒక పదవితో ప్రభావవంతంగా ఉన్న రాజపక్సేల కుటుంబం పరారు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సె ఆర్థిక విధానాలు శ్రీలంకను తీవ్ర సంక్షోభంలో ముంచెత్తాయి. దీంతో ప్రజాగ్రహం పెల్లుబికింది.
అబె దారుణ హత్య షింజో అబె.. జపాన్ లో అత్యంత ప్రభావవంతమైన నేత. మాజీ ప్రధానిగా, భారత్ కు ఆప్త మిత్రుడిగా అన్నిటికి మించి చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ కూటమి రూపకర్తగా అబె పేరు అందరికీ తెలిసింది. అంతటి శక్తిమంతమైన నేతను కేవలం సాధారణ మాజీ సైనికుడు అతి సమీపంలో అదికూడా ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్చిచంపాడు. ఓ ధార్మిక సంస్థకు నిందితుడి తల్లి భారీ విరాళం ఇచ్చి దివాలా తీయడం, ఆ సంస్థకు అబె మద్దతుదారు కావడంతో నిందితుడు ఆయనపై కక్ష పెంచుకుని హత్య చేశాడు. ఇక అమెరికాలో తుపాకీ కల్చర్ ఎప్పటినుంచో వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికితగ్గట్లే ఇటీవల వరుసగా కాల్పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
వీటి మధ్యలో "అబార్షన్ హక్కు"పై సుప్రీం కోర్టు రూలింగ్ తీవ్ర వివాదాస్పదం అయింది. పాకిస్థాన్ లో మూడు నెలల కిందటి వరకు ఇమ్రాన్ ఖాన్ కు ఎదురులేదని అంతా భావించారు. కానీ, ఆయన సర్కారు అనూహ్యంగా కూలిపోయింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. చైనాలో ఇటీవలి వరకు కొవిడ్ దాడితో షాంఘై నెలల తరబడి లాక్ డౌన్ లో ఉండిపోయింది.
ప్రపంచంలో న్యూయార్క్ తర్వాత అత్యంత పెద్ద వాణిజ్య నగరమైన షాంఘైకి కొవిడ్ తొలినాళ్లలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటే విచిత్రం అనిపించకమానదు. ఇక రష్యా దాడితో ఉక్రెయిన్ దీనావస్థలోకి జారుకుంది. ఆ దేశంలోని నగరాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ప్రధాన తీర నగరం మారియుపోల్ రష్యా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ మొత్తం రష్యా పరం అయ్యేలా ఉంది... మొత్తానికి ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థ్థితి.