దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. అయితే , సెకండ్ వేవ్ జోరు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం గత మూడు రోజులుగా లక్షకి దిగువగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే , కరోనా మరణాలు మాత్రం కొంచెం ఆందోళనకి గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయిలే , అని సంతోషించేలోపే దేశంలో బ్లాక్ ఫంగస్ విజృంభణ అందరిని వణికిపోయేలా చేస్తుంది. సెకండ్ వేవ్ నుండి త్వరలోనే బయటపడబోతున్నాం అని అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతుండటం బాధాకరం.
గత మూడు వారాలుగా ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 31,216 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 2,109 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాల లెక్కలని బట్టి తెలుస్తున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 7,057 కేసులు నమోదుకాగా, 609 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో 5,418 కేసులు వెలుగుచూడగా, 323 మందిని బ్లాక్ ఫంగస్ బలితీసుకుంది. 2,976 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. కర్ణాటకలో 188 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. ఉత్తర్ ప్రదేశ్, దిల్లీల్లోనూ వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్, బి ఔషధం కొరత వల్లే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇదేమీ కొత్తవ్యాధి కాకపోయినా.. దీనిబారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహులకు ఇది ప్రమాదంగా మారుతోంది. స్టెరాయిడ్లు ఎక్కువ తీసుకున్నవారికి కూడా బ్లాక్‌ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.