అంతకంతకూ పెరిగిపోతున్న అత్యాచార ఉదంతాల సమాచారం విన్నా.. అందుకు సంబంధించిన వార్తలు చదువుతున్నా కోపం కట్టలు తెగేలా చేస్తుంది. సాటి మనిషిపై అనాగరికంగా.. జంతువులు సైతం చేయని రీతిలో మనిషి చేస్తున్న వైనానికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితి.
అపరిచిత వ్యక్తుల్ని ఏ మాత్రం నమ్మకూడదన్న సంగతి ఎప్పటి నుంచో ఉన్నా.. బాగా తెలిసిన వారు.. 65 ఏళ్లు దాటిన వృద్ధుల్ని కూడా నమ్మకూడదన్నట్లుగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఎక్కడికి పోతున్నామన్న భావన కలగక మానదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. జీవితంలో కోలుకోలేని విషాదం ముంచుకొచ్చేలా అపాయం పొంచి ఉందన్న వైనం తాజాగా బయటకు వస్తున్న దారుణాల్ని చదువుతున్నప్పుడు అర్థం కాక మానదు.
చెన్నైలో పదకొండేళ్ల ఒక బధిర బాలికపై 65ఏళ్లకు పైనే వయసున్న లిఫ్ట్ గార్డు అత్యాచారం చేయటం.. ఆపై తనకు తెలిసిన వారందరి చేత ఆమెపై అత్యాచారం చేసిన వార్త కోట్లాదిమందిని షాక్ కు గురి చేసింది. దాని నుంచి బయటకు రాకముందే మరో షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. హర్యానాలోని పంచ్ కుల జిల్లాలోని మోర్ని ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల వివాహితకు ఘోరమైన అన్యాయం ఒకటి ఎదురైంది.
ఉద్యోగం ఇస్తామని చెప్పి.. తెలిసిన వ్యక్తి ఒకరు 22 ఏళ్ల వివాహితను పిలిచారు. అతన్ని నమ్మి వెళ్లిన ఆమెకు నరకమే ఎదురైంది. నాలుగు రోజుల పాటు 40 మంది ఆమెను అత్యాచారం చేశారు. ఆమెను బంధించి జూన్ 15 నుంచి 18 వరకూ రోజుకు పది మంది చొప్పున ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారు. డ్రగ్స్ ఇచ్చి మత్తులో పడేసి.. ఆమెకు నరకం చూపించారు. చివరకు ఎలాగోలా బయటపడి.. భర్తకు సమాచారం అందించటం.. ఆ విషయాన్ని ఆయన పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఈ దారుణం బయటకు వచ్చింది. ఈ దారుణానికి కారణమైన గెస్ట్ హౌస్ యజమానితో పాటు మేనేజర్ తో సహా మరొకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు.