ఆ నిర్లక్ష్యంతో 2234 మందికి హెచ్ ఐవీ

Update: 2016-05-31 10:17 GMT
విన్నవెంటనే ఉలిక్కిపడే ఉదంతమే ఇది. అత్యవసరర సమయాల్లో.. అపత్ కాలంలో రక్తం అవసరమైనప్పుడు మరింకేమీ ఆలోచించకుండా బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తం తీసుకురావటమే తప్పించి.. దాన్ని సరిగా పరీక్షలు చేశారా? లేదా? లాంటి క్రాస్ చెక్ క్వశ్చన్స్ ఎవరూ వేసుకోరు. కానీ.. తాజా లెక్కలు వింటే మాత్రం అలాంటి ప్రశ్నలు వేసుకోవాలేమో అని భయం కలిగించే అంశంగా దీన్ని చెప్పొచ్చు.

2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్య కాలంలో బ్లడ్ ఎక్కించుకున్న వారిలో 2234 మందికి హెచ్ఐవీ సోకినట్లుగా గుర్తించారు. ఒక సామాజిక కార్యకర్త సమాచారహక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాధానం షాక్ తగిలేలా చేసిందని చెప్పాలి. బ్లడ్ శాంపిల్స్ ను సరిగా పరీక్షించకపోవటంతో ఇంత భారీ సంఖ్యలో హెచ్ఐవీ బారిన పడినట్లుగా అధికారులు చెబుతున్నారు. 2014 నుంచి దాదాపు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకులు సేకరించగా.. నిర్లక్ష్యంతో సరైన పరీక్షలు జరపని దానికి బదులుగా వేలాది మంది హెచ్ ఐవీ బారిన పడటం గమనార్హం.
Tags:    

Similar News