రూ.24 వేల కోట్ల అహ్మదాబాద్ - ముంబై మధ్య తొలి బుల్లెట్ రైలు..కీలక ముందడుగు!
ముంబై , అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు కి మరో అడుగు ముందుకుపడింది. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద కాంట్రాక్టుగా ఈ తోలి బుల్లెట్ రైలు గా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఇంత భారీ స్ధాయిలో ఏ సివిల్ కాంట్రాక్టు కూడా జరగలేదు.508 కిలో మీటర్లన పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు జరగాల్సి ఉంది. దేశంలోనే తొలి, అత్యంత భారీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్-ఎల్ అండ్ టీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
మొత్తం రూ.24 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ కాంట్రాక్టును ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్ధ ఎల్ అండ్ టీ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకూ బుల్లెట్ ట్రైన్ కోసం ప్రత్యేక మార్గం నిర్మించాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుతం గుజరాత్ పరిధిలోని 325 కిలోమీటర్ల మార్గంలోనే ఎల్ అండ్ టీ పనులు చేప్పట్టబోతోంది. అయితే , మహారాష్ట్ర లో భూసేకరణలో సమస్యలు ఉన్నందున దీనితో సంబంధం లేకుండా గుజరాత్ లో పనులు ప్రారంభించాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు రూపొందుతుంది.
భారత్ లో ఆర్ధిక కార్యకలాపాలు విస్తరించేందుకు జపాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంతటి భారీ కాంట్రాక్టు దక్కడం సంతోషంగా ఉందని జపాన్ రాయబారి సతోషీ సుజుకీ తెలిపారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం భారత్ కు దక్కడమే కాకుండా ఈ కారిడార్ వెంబడి పట్టణాబివృద్ధికీ బాటలు పడతాయని ఆయన వెల్లడించారు. ఇది విజయవంతంగా పూర్తయితే మరో ఏడు మార్గాల్లో ఇలాంటి ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు రైల్వేబోర్డు సీఈవో వీకే యాదవ్ తెలిపారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల వల్ల భారీగా నిపుణులకు ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు.