బ్రేకింగ్ : పుణేలో 25 మందికి కరోనా పాజిటివ్ !

Update: 2020-04-21 08:51 GMT
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. అయితే , ఈ ప్రాణాలు తీసే మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో వైద్యులది ప్రముఖ పాత్ర. తమ ప్రాణాలని పనంగా పెట్టి ..ఈ కంటికి కనిపించని శత్రువుతో వైద్యులు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో అక్కడక్కడా కొంతమంది వైద్యులు కూడా వైరస్‌ బారినపడుతున్నారు. తాజాగా పుణేలోని రూబీ హాల్‌ క్లినిక్‌ లో విధులు నిర్వర్తిస్తున్న 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది.

ఈ 25 మందిలో  19 మంది నర్సులు కూడా ఉన్నారని రూబీ హాల్‌ క్లినిక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బోబి బోటే తెలిపారు. కరోనా సోకిందేమో అన్న అనుమానంతో దాదాపు వేయి మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా - 25 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని బోబి బోటే తెలిపారు.  వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, క్వారంటైన్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

కాగా, మహారాష్ట  వ్యాప్తంగా ఇ‍ప్పటి వరకు 4203 కరోనా కేసులు నమోదవ్వగా - 223 మంది మృతిచెందారు. ఇక పుణేలో 87 కొత్త కరోనా కేసులతో కలుపుకుని మొత్తం 756 మంది కరోనా బారిన పడ్డారు. ఇకపోతే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 18,601 మందికి కరోనా సోకగా .. 590 మంది కరోనా భారిన పడి మృతి చెందారు.
Tags:    

Similar News