దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
కాగా, వారిలో 12 మంది ఉన్నతాధికారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నిర్దారణ అయిన అధికారులతో కాంటాక్ట్ ఉన్న మిగతా పోలీసులను కూడా క్వారంటైన్ కి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా , ఇప్పటి వరకు ముంబైలో దాదాపు 250 మంది పోలీసులకి కరోనా సోకిందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చెప్పారు.కాగా, ఇప్పటికే ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52 వేలకు పైగానే కరోనా కేసులు నమోదు కాగా..అందులో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా, 583 మంది మరణించారు.