నేపాల్‌ లో క‌ల‌కలం రేపిన భార‌తీయులు..వారికి క‌రోనా

Update: 2020-04-12 14:53 GMT
ప‌ర్వ‌త‌గిరి ప్రాంత‌మైన నేపాల్‌ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిలోపు క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు ఉండ‌గా.. ఇప్పుడు ఒక్క‌సారిగా 12కు చేరాయి. శాంతియుత వాతావ‌ర‌ణంలో ఉండే ఆ దేశం అనూహ్యంగా క‌రోనా కేసుల‌తో ఉలిక్కిప‌డింది. అయితే దానికి కార‌ణం భార‌తీయులే. భార‌త‌దేశానికి చెందిన 21 మంది నేపాల్‌లోని ఓ స‌మీదుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఆ దేశంలో లాక్‌ డౌన్ కొన‌సాగుతుండ‌డంతో మ‌సీద్‌ లో ఉన్న వారిని అక్క‌డి అధికారులు గుర్తించారు. వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా ఆ 21మందిలో ముగ్గురికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ దేశం ఉలిక్కిప‌డింది. ఈ ఘ‌ట‌న నేపాల్‌ లోని బిర్గంజ్‌ జిల్లాలోని చ్చప్‌ కయా ప్రాంతంలో చోటుచేసుకుంది.

చ్చప్‌ కయాలో ఉన్న ఓ మసీదులో 21 మంది భార‌తీయులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వారంతా ఇటీవల అక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజర‌య్యారు. వెంట‌నే వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో 37 - 44 - 55 సంవ‌త్స‌రాలు వ‌య‌సున్న వారు. ప్రస్తుతం వారిని నారాయణి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఈ కేసులతో క‌లిపి నేపాల్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. అయితే ఆ భార‌తీయులు ప్ర‌స్తుతం భార‌త్‌ లో విధించిన లాక్‌ డౌన్ వ‌ల‌న తిరిగి రాలేక నేపాల్‌ లో ఉండిన‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత భార‌త్‌ లోకి రావాల‌ని చూస్తున్నారు. ఈలోపు వారికి క‌రోనా సోకింది. వారితో క‌లిపి మొత్తం 21 మందిని నేపాల్‌ లో క్వారంటైన్‌ కు పంపారు.

Tags:    

Similar News