జాత్యంహకారంతో భారతీయ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ను మట్టుబెట్టిన ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడికి న్యాయస్థానం సంచలన శిక్ష వేసింది. గతఏడాది కన్సాస్ నగరంలోని ఓ బార్ లో ఆడమ్ పూరింటన్ పిస్తోల్ తో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ కేసులో మాజీ నేవీ ఉద్యోగి అయిన పూరింటన్ పై వర్ణవివక్షతో పాటు ఆయుధాలు కలిగి ఉన్న కేసును నమోదు చేశారు. ఈ కేసులో ఆ దేశ ఫెడరల్ కోర్టు.. నిందితుడు ప్యూరింటన్ కు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీనికి కొనసాగింపుగా తాజాగా కోర్టు మూడు జీవిత కాలాల జైలు శిక్షను విధించింది. నిందితుడు పూరింటన్ జాత్యహంకారంతో చేసిన హత్యగానే న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. న్యాయమూర్తిని పూరింటన్ క్షమాభిక్ష కోరినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు.
2017, ఫిబ్రవరిలో శ్రీనివాస్ కూచిబొట్ల కాల్పుల ఘటనలో గాయపడిన అలోక్ మాదసాని ఆ రోజు జరిగిన ఘటనను కోర్టుకు వివరించారు. కాల్పులు జరిపే ముందు ఒకసారి తమ దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడి వెళ్లిపోయాడని అలోక్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గన్ తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ కు మూడు బుల్లెట్ గాయాలు కాగా.. అతను అక్కడికక్కడే మరణించాడు. అలోక్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వాళ్లను కాపాడే ప్రయత్నం చేసిన ఇయాన్ గ్రిలాట్ కు చేయి - ఛాతీల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణ సమయంలో నిందితుడు పూరింటన్.. కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరిస్తూ.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నాడు. తానే కూచిభొట్లను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. ఆ రోజు ఆస్టిన్ బార్ లో జరిగిన కాల్పుల్లో మరో భారతీయుడు అలోక్ మదసాని గాయాల పాలయ్యాడనే విషయం తనకు పోలీసులు తెలిపారని వివరించాడు. తనపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అతను కోరుకున్నాడు.
కాగా, తాజా తీర్పుపై శ్రీనివాస్ సతీమణి సునయన స్పందనను న్యాయమూర్తి చదివి వినిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆమె ఆకాంక్షించారు. ``నువ్వు నా భర్తను ఏమని పిలవాలని (జాతి వివక్ష వ్యాఖ్యలు) అనుకున్నావో ఆయన అంతకంటే చాలా మంచివారు. నువ్వు ఆయనతో మాట్లాడి ఉంటే ఛామన ఛాయలో ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్లే కాదనీ, వారిలో ఎంతోమంది అమెరికా వృద్ధికి దోహదపడుతున్నారని వివరించేవారు. ఎన్నో కలలు - ఆశలు - ఆకాంక్షలతో అమెరికాకు వచ్చాం. ఇప్పుడు నా అమెరికా కల, మా ఆయన కల చెదిరిపోయాయి’ అని విలపించారు. కాగా, శ్రీనివాస్ హత్య తర్వాత సునయన.. ఇమ్మిగ్రేషన్ సంబంధిత అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ ఫేస్ బుక్ పేజ్ స్టార్ట్ చేశారు. ఈ మధ్యే ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగ కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు.