శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే.. ఏకంగా నాలుగు రోజులు. దీనికి మించిన లాంగ్ వీకెండ్ ఏముంటుంది? ఒక్క సెలవుతో.. శుక్ర.. శని..ఆది..సోమ వరకు సెలవుల్ని ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఎవరు మాత్రం మిస్ అవుతారు? అందుకే గత శుక్రవారం నుంచి సెలవుల మీద సెలవులు పెట్టేస్తున్నారు ఐటీ జీవులు. ఇలాంటి లాంగ్ వీకెండ్ ను మరింత బాగా ఎంజాయ్ చేయటానికి చాలామంది ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ఇతర చోట్లకు వెళుతుంటారు. ఐటీతో పాటు.. వివిధ రంగాలకు చెందిన వారు వచ్చిన సెలవుల్ని వినియోగించుకోవటానికి వీలుగా వెళుతున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి.
లాంగ్ వీకెండ్ వేళ.. తిరుమలకు ప్లాన్ చేసుకున్న వారు ఎంత ఎక్కువగా ఉన్నారంటే.. శనివారం సాయంత్రం నుంచి కొండ ఎంతలా కిక్కిరిసిపోయిందంటే.. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. తిరుమల కొండకు వచ్చిన వారంతా స్వామి వారి దర్శనం కోసం తపించటం తెలిసిందే. ఇంత భారీగా వచ్చిన భక్తుల దర్శనం గంటల కొద్దీ సాగుతోంది. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర ఉంటున్నాయి. ఇక..
గదుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు అన్నట్లుగా మారింది. లాంగ్ వీకెండ్ వచ్చిన వేళ.. రద్దీ ఉంటుందన్న విషయాన్ని వదిలేసి.. ఏదైతే అదైంది.. ముందు అయితే తిరుమల వెళ్లొద్దామనే వారు లక్షలాది మంది ఉండటంతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్నారు. క్యూలైన్లో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి రావటమే కాదు.. స్వామి వారి దర్శనం కోసం ఏకంగా ముప్ఫై గంటలు ఎదురుచూడాల్సిన పరిస్థితి. భారీగా వస్తున్న భక్తులకు తగ్గట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేయకపోవటంతో వారు నరకం అన్నది ప్రత్యక్షంగా చవి చూడాల్సి వస్తోంది. ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండిపోవటంతో.. లేపాక్షి సర్కిల్.. షాపింగ్ కాంప్లెక్స్..
పాత అన్నదానం మీదుగా శ్రీవారి సేవా సదన్ వద్ద క్యూ లైన్ ఉందంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.స్వామివారి ఉచిత దర్శనానికి 30 గంటలు పడుతుంటే.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం తీసుకొంటోంది.
టీటీడీ ఏర్పాట్లు బాగా లేవని భక్తులు వాపోతున్నారు. కాలి నడకన వచ్చిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవటంతో ఆ భక్తుల పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారింది. వరుస సెలవుల పుణ్యమా అని కిక్కిరిసిన భక్తుల కారణంగా కొండ మీద పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది.కనీసం భోజన సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉందని.. టీటీడీ చేష్టలుడిగినట్లుగా ఉన్నట్లు భక్తులు వేదన వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ వీకెండ్ కావొచ్చు.. వరుస సెలవులు వచ్చినప్పుడు తిరుమలకు మాత్రం ప్లాన్ చేయొద్దన్న సూచన చేస్తున్నారు. అయినా వెళితే.. ఇబ్బందులు తప్పవన్నది మర్చిపోకూడదు.