వామ్మో...ర‌విప్ర‌కాశ్ ద‌ర్యాప్తునే దారి త‌ప్పిస్తున్నార‌ట‌

Update: 2019-06-06 04:19 GMT
టీవీ 9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్ నిజంగా మొండి ఘ‌ట‌మేన‌బ్బా. టీవీ 9 వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉంటూ ఆ టీవీ ఛానెల్ ను కొన్న కొత్త యాజ‌మాన్యానికి చుక్క‌లు చూపించ‌బోయి... తానే అడ్డంగా బుక్కైపోయిన ర‌విప్ర‌కాశ్.... పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి గాలించినా అస్స‌లు జాడే క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కోర్టుల్లో ముంద‌స్తు బెయిల్ పిటీష‌న్లు దాఖ‌లు చేస్తూ... ఎక్క‌డైనా చిన్న అవ‌కాశ‌మైనా ద‌క్క‌క‌పోతుందా? అన్న కోణంలో ఆలోచించిన ర‌విప్ర‌కాశ్... చివ‌రికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులోనూ బెయిల్ రాక‌పోవ‌డంతో ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా పోలీసుల ముందు ప్ర‌త్య‌క్ష‌మైపోయారు.

ఎంతైనా జ‌ర్న‌లిజం వంటబ‌ట్టిన బుద్ధి క‌దా... పోలీసుల విచార‌ణ‌కు వ‌చ్చినా... త‌న‌ను విచారిస్తున్న ఖాకీల‌కు ర‌విప్ర‌కాశ్ చుక్క‌లు చూపిస్తున్నార‌ట‌. ఏది అడిగినా... ఒక్క నిజం కూడా చెప్పేందుకు స‌సేమిరా అంటున్న ర‌విప్ర‌కాశ్ అన్నీ అబద్ధాలే చెబుతున్నార‌ట‌. ఈ క్ర‌మంలో తొలి రోజు ఎలాగోలా మేనేజ్ చేసిన పోలీసులు నిన్న రెండో రోజు విచార‌ణ‌లో కూడా ర‌విప్ర‌కాశ్ తీరులో మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల‌లు ప‌ట్టుకున్నార‌ట‌. రెండు రోజుల విచార‌ణ‌లో ర‌విప్ర‌కాశ్ విచార‌ణ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌ని కార‌ణంగా వ‌రుస‌గా మూడో రోజు కూడా విచార‌ణ‌కు రావాల్సిందేన‌ని పోలీసులు ఆయ‌న‌కు ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఈ క్ర‌మంలో నేడు కూడా ర‌విప్ర‌కాశ్ పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కాక త‌ప్ప‌దు.

విచార‌ణ ప‌ర్వం ముగిస్తే గానీ అరెస్ట్ మాట ఎత్తే ప‌రిస్థితి క‌నిపించ‌ని నేప‌థ్యంలో అస‌లు ర‌విప్ర‌కాశ్ త‌మ‌ను ఎన్ని రోజులు స‌తాయిస్తారో చూస్తామంటూ కూడా పోలీసులు క్వ‌శ్చ‌నీర్ కూడా కాస్తంత క్లారిటీగానే కాకుండా అసంబ‌ద్ధ స‌మాధానాలు రాకుండా ఉండేలా రూపొందిస్తున్నార‌ట‌. రెండో రోజు విచార‌ణ ముగిసిన త‌ర్వాత కూడా చిద్విలాసంతోనే బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విప్ర‌కాశ్ జాలీగా ఇంటికెళ్లిపోగా... ఆయ‌న‌ను విచారిస్తున్న పోలీసులు మాత్రం ద‌ర్యాప్తు ఎక్క‌ద దారి త‌ప్పుతుందోన‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం. తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ర‌విప్ర‌కాశ్ ఇస్తున్న స‌మాధానాల‌ను ఆధారం చేసుకుంటే... అస‌లు కేసే దారి త‌ప్పే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న భావ‌న‌ను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడో రోజు విచార‌ణ‌లో ర‌విప్ర‌కాశ్ త‌న‌దైన శైలి డొంక తిరుగుడు స‌మాధానాలు చెప్ప‌కుండా ఉండేలా ప్ర‌శ్నావ‌ళిని ర‌చిస్తున్న‌ట్లుగా స‌మాచారం. మ‌రి మూడో రోజు విచార‌ణ‌కైనా ర‌విప్ర‌కాశ్ ఏ మేర స‌హ‌క‌రిస్తారో చూడాలి.

Tags:    

Similar News