అంత స్పీడే విద్యార్థులను బలితీసుకుందా..

Update: 2019-05-01 11:16 GMT
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి అతివేగంగా కారు మూలమలుపు వద్ద బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు చనిపోయారు. వీరంతా ఇబ్రహీం పట్నం శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా తేలింది.

సదురు నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకున్నారని తెలిసింది. అనంతరం హోండాకారులో హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేని పల్లి వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పింది. దాదాపు 130కి.మీల స్పీడుతో ఉన్న కారు బోల్తాపడింది. ఈ ఘటనలో నల్లగొండ కు చెందిన స్ఫూర్తి, చాదర్ ఘాట్ కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్ కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే మృతిచెందారు. కుంట్లూరు కు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్ కు చెందిన వినీత్ రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి మృతిచెందగా. మనీస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

ఇందులో ప్రణీత చనిపోగా.. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు. అమ్మమ్మ వద్ద ఆమె ఉంటూ చదువుకుంటోంది. స్ఫూర్తి రెడ్డిది నల్గొండ. చైతన్యది అవంగపట్నం. వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ. ప్రస్తుతం వీరు హైదరాబాద్ జిల్లాలగూడా గాయత్రి నగర్ లో ఉంటున్నారు. వీరి మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తయ్యింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు.

కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బుధవారం విద్యార్థుల మృతదేహాలను సందర్శించి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు.
Tags:    

Similar News