ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని చెబుతారు. దీనికి తగ్గట్లే విపత్తుల వేళ.. సంక్షోభాల వేళ ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందని చెప్పాలి. తెలంగాణలో చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కూలీలు.. కార్మికులను వారి సొంతూళ్లకు పంపించే పెద్ద కార్యక్రమానికి తెర తీశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం కాకున్నా.. ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చిన వారందరికి లాక్ డౌన్ వేళ ఏ మాత్రం లోటు లేకుండా చూస్తామని కేసీఆర్ చెప్పినప్పటికి వలస కూలీల్లో మాత్రం చెప్పలేని ఆందోళన నెలకొంది. కరోనా వేళ ఊరు కాని ఊళ్లో ఉండటానికి వారు ససేమిరా అన్నారు. వందల కిలోమీటర్ల లక్ష్యాన్ని కాలినడకతో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద ఒత్తిడిని పెంచింది. తమ కన్నబిడ్డల మాదిరి వలసకూలీల్ని.. కార్మికుల్ని చూస్తామని చెప్పిన ప్రభుత్వం మాటకు భిన్నంగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కాలిబాటన తమ ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. కంది ఐఐటీ వద్ద ఉన్న రెండు వేలకు పైగా వలసకూలీలు.. తమకు కల్పిస్తున్న వసతుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఆందోళనను నిర్వహిచారు. పోలీసుల మీదా.. పోలీసుల వాహనాల మీద రాళ్లదాడి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారి ఆకలి కేకలు అంతకంతకూ పెరిగిపోవటం.. వారిని సముదాయించటం తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్నిప్రాంతాల్లోని వలస కూలీలు..కార్మికులు ఆందోళనను నిర్వహిస్తుండటంతో.. తెలంగాణ సర్కారు అలెర్టు అయ్యింది.
ఇలానే వదిలేస్తే.. శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందన్న విషయాన్ని గుర్తించి కేసీఆర్ సర్కారుయుద్ద ప్రాతిపదికన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వలసకూలీలు.. కార్మికుల్ని వారి సొంతూళ్లకు పంపే ప్రయత్నానికి తెర తీశారు. ఈ నిర్ణయం వెనుక మరో కారణం లేకపోలేదు. తెలంగాణలోని వ్యవసాయ పనులకు ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలు చేస్తారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న యూపీ కార్మికుల్ని తీసుకెళ్లే రైలు.. తిరుగు ప్రయాణంలో అక్కడి వారిని తెలంగాణకు తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
వాస్తవానికి రోజుకు నలభై రైళ్ల చొప్పున వారం పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు రైళ్లను నడపాలన్న వ్యూహంలో ఉంది కేసీఆర్ సర్కారు. అయితే.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అధికారులు సీఎం కేసీఆర్ కు ఫోన్లు చేసి.. ఒక్కసారి తమ రాష్ట్రానికి ఇంత భారీగా రైళ్లలో తమ వారిని పంపిస్తే.. వారిని వారి స్వగ్రామాలకు చేర్చటం కష్టమన్న మాట వారి నోటి నుంచి వచ్చిందట. దీంతో.. ముందుగా అనుకున్న నలబై రైళ్ల స్థానే కోటా తగ్గించారు. మంగళవారం ఒక్కరోజులో 12 రైళ్లను నడిపారు. ఒక్కో రైలులో 1200 మంది చొప్పున చూసినా దగ్గర దగ్గర పదిహేను వేల మందిని వారి రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం పంపినట్లుగా చెప్పొచ్చు.