పోలీసులకి కులం లేదు .. 40 ఏళ్ల అనుభవం ఇదేనా బాబు .. పోలీస్ సంఘం ఫైర్ !

Update: 2021-01-07 12:08 GMT
ప్రస్తుతం ఏపీలో ఆలయాల దాడులు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా రోజుకో చోట ఎదో ఒక ఆలయం పై దాడులు జరుగుతున్నాయి. దానికి తోడు ఆలయ దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. అయితే , అసలు ఆలయాల పై దాడులు ఎందుకు , ఎవరు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియలేదు. ఇదిలా ఇలా ఉంటే .. ఆలయాల ఘటనల్లో ఎవరి తప్పు ఎంత ఉంది అని కొంచెం లోతుగా ఆలోచిస్తే ... అనవసర ప్రాధాన్యం ఇస్తూ అక్కడ ఏమీ జరగకపోయినా , జరిగినట్టు చిత్రకరించి చూపిస్తూ మీడియా కొంచెం ఎక్కువ చేస్తుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని నిజ నిర్థారణ చేసుకోకుండానే సెన్సేషన్ కోసం ప్రసారం చేయడం, ఆ ఛానెల్ లో వచ్చింది అంటూ ఇంకో ఛానెల్ ప్రసారం చేస్తున్నారు . దీనితో అసలు ఏది నిజం , ఏది అబద్దం అని తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై పడుతోంది. ఆ ఛానెల్ లో వచ్చిన వార్తల ఆధారంగా విపక్షాలు కూడా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. దీనితో ఇటీవల సీఎం జగన్ ఆదేశాలతో పోలీసులు కొంచెం అలర్ట్ అయ్యారు. సింగరాయకొండ కేసులో ఏకంగా ఐదుగురు మీడియా ప్రతినిధులు అరెస్ట్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు అక్కడ ఏమీ జరిగింది .. దాన్ని ఎలా వక్రీకరించారు అంటే ? .. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆర్చి 20ఏళ్ల క్రితం సిమెంట్ తో నిర్మించారు. అప్పుడప్పుడూ పెచ్చులూడి పడటం సహజమే. గత నవంబరులో ఈ ఆర్చి నుంచి పెచ్చులూడుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడంలేదని ఓ ప్రముఖ ఛానెల్ లో వార్త వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇది కూడా ఓ పెద్ద నేరంగా మారింది. ఓ లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో, విజువల్స్ తో.. అది తప్పుడు సమాచారం అని తెలిసి కూడా మీడియా పదే పదే అదే టెలికాస్ట్ చేసి చూపించారు. ఈ వార్తల ఆధారంగా ప్రతిపక్షాలు కూడా రెచ్చిపోయాయి. ఆలయాల ఘటనలో దీన్ని కూడా జమకట్టేసారు. సింగరాయ కొండ ఘటనలో పూర్తిగా మీడియాదే తప్పు అంటున్నారు పోలీసులు. ప్రస్తుతానికి ఐదుగురు మీడియా ప్రతినిధుల్ని అరెస్ట్ చేశారు, మరికొందరిపై కేసులు పెట్టారు. ఈ తరహా కేసులు ఇంకెన్ని ఉన్నాయో త్వరలోనే బయటపెట్టనున్నారు. ఈ తరహా వార్తలు చాలా సున్నితం కాబట్టి .. అసలు అక్కడ ఏం జరిగింది , అది ఎందుకు జరిగింది , అసలు అది నిజమేనా అని ఓ నిర్దారణకి వచ్చిన తర్వాత ఆ వార్తను అర్థవంతంగా ప్రచారం చేస్తే పోలీసుల కేసుల నుండి తప్పించుకోవచ్చు , లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది. కాబట్టి పోలీసుల హెచ్చరికల తర్వాత అయినా కూడా పెన్ను , పేపర్ పై కొంచెం జాగ్రత్తగా అక్షరాలు రాస్తే బాగుంటుంది.

ఇదిలా ఉంటే .. పెళ్లి వారు పెళ్లి వారు మంచోళ్లు ..పెళ్ళికి వచ్చినవారు పిచ్చోళ్ళు అన్నట్టుగా రాజకీయ పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ చివరికి పోలీసులని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు వాటిని సమర్దంగా అడ్డుకోలేకపోతున్నారని ఓసారి, గుళ్ల సందర్శనకు వెళ్తున్న విపక్ష నేతలను అడ్డుకుంటున్నారని మరోసారి పోలీసులపై పలు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమపై వస్తున్న ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం నేడు తీవ్రంగా స్పందించింది. కొంతమంది రాజకీయ నాయకులు దురుద్దేశపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది. కుల, మత భేదాలు లేకుండా ప్రజల సేవకై నిరంతరం పాడుపడుతూ విధులు నిర్వర్తిస్తున్నామని సంఘం తెలిపింది. మా మతం, కులం ఖాకీయేనని, మానవతా విలువలతో కూడిన ప్రజాసేవ మా బాధ్యతని పోలీసు అధికారుల సంఘం పేర్కొంది.

రాజ్యాంగాన్ని, చట్టాలను మేం భవద్గీత, ఖురాన్‌, బైబిల్ ‌గా భావిస్తామని తెలిపింది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మతప్రమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వాటిని పోలీసులకు ఆపాదించడం దేనికి సంకేతమని సంఘం ప్రశ్నించింది. సీఎం, హోంమంత్రితో పాటు డీజీపీ కూడా క్రైస్త్రవుడే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు వంటి సర్వమత కలయిక పోలీసు శాఖ అని తెలిపింది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవ నాయకుడు పోలీసులను కులమత దృక్పథంతో పోల్చడం ఎంతవరకూ సమంజసమని చంద్రబాబును ప్రశ్నించింది. ఈ సందర్భంగా కరోనా పోరు లో 109 మంది పోలీసులు మృతి చెందారు అని తెలిపారు.



Tags:    

Similar News