కేవలం 60 సెకన్లలో 5లగ్జరీ కార్లు చోరీ!

Update: 2022-12-07 16:55 GMT
బ్రిటన్ దేశంలో దొంగలు మరీ తెలివిమీరిపోయారు. నగరానికి దూరంగా గ్రామాల్లో ఉంటూ లగ్జరీ లైఫ్ గడుపుతున్న కోటీశ్వరులను టార్గెట్ చేశారు. అందివచ్చిన  అవకాశాన్ని వదిలిపెట్టలేదు.  కొన్ని పనులు చేయడం అసాధ్యం అనిపిస్తుంది. సినిమాల్లో మాదిరిగా దొంగతనాలు ఎన్నిసార్లు జరిగినా జనాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి.

60 సెకన్లలోపు ఐదు లగ్జరీ కార్లను దొంగిలించడాన్ని మీరు ఊహించగలరా? ప్రజలు కోట్లాది విలువైన తమ కార్లను బహిరంగంగా.. అసురక్షితంగా ఉంచరు కాబట్టి ఇలా దొంగిలించడం చాలా అసాధ్యం అనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఈ దొంగలు సరిగ్గా అదే చేశారు. ఇక్కడ ఏమి జరిగిందో సీసీటీవీల్లో చూసి పోలీసులు, ప్రజలు కూడా అవాక్కయ్యారు.

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో ఇటీవల జరిగిన సినిమా తరహా దోపిడీలో 60 సెకన్ల వ్యవధిలో ఐదు లగ్జరీ కార్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. క్లిప్ వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. వీడియో ప్రకారం, ఈ సంఘటన నవంబర్ 11 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మొత్తం దోపిడీ 60 సెకన్లలో ముగిసింది.

వీడియోలో థురోక్ బరో సమీపంలోని బుల్ఫాన్ గ్రామంలోని బ్రెంట్‌వుడ్ రోడ్‌లోని కాంపౌండ్ ముందు ద్వారం తెరిచి మరీ  దొంగలు లోపలికి చొరబడ్డారు.  కొన్ని సెకన్ల తర్వాత వారు ఐదు వాహనాలను నడుపుకుంటూ గేట్ వద్దకు వచ్చారు. రెండు ఖరీదైన పోర్ష్‌లే కారులు.. మరియు ఒక మెర్సిడెస్ మేబ్యాక్, అరుదైన ఏరియల్ ఆటమ్ కాంపౌండ్ వరకూ తీసుకొచ్చారు. వారిలో ఒకరు ముందు ద్వారం తెరిచి ఉంచగా ఇతరులు ఒక్కొక్కటిగా కాంపౌండ్ నుండి కార్లను బయటకు తీసుకొచ్చి కారుతో పారిపోయారు..

కార్లు ఒక పారిశ్రామిక యూనిట్ నుండి దొంగిలించబడ్డాయి. కార్ల మొత్తం ఖరీదు 700,000 యూరోలు అంటే దాదాపు రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కార్లతో పాటు లగ్జరీ కార్ల దొంగల కోసం ఎస్సెస్సీ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు పోలీసులు మెర్సిడెస్ మేబ్యాక్ కార్లలో ఒకదానిని రికవరీ చేయగలిగారు. బుల్ఫాన్‌లోని బ్రెంట్‌వుడ్ రోడ్ నుంచి తీసుకున్న ఇతర నాలుగు వాహనాలను ఇప్పటికీ ఎసెక్స్ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.

కాంపౌండ్‌లోకి ప్రవేశించే ముందు దుండగులు ఫ్రంట్ గేట్ బోల్ట్‌లను కత్తిరించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు. ఈ చోరీకి సంబంధించిన ఏదైనా సమాచారం కోసం ఆ ప్రాంత ప్రజలకు తెలిస్తే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఏదైనా చూసిన వారు లేదా దొంగిలించబడిన కార్లతో సహా సీసీటీవీ డాష్‌క్యామ్ ఫుటేజీని కలిగి ఉన్న ఎవరైనా మమ్మల్ని సంప్రదించమని విజ్ఞప్తి చేస్తున్నాము" అని పోలీసులు తెలిపారు,



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News