అత్యున్నత స్థానాల్లో ఉండే వారు చేసే తప్పుల కారణంగా జరిగే నష్టం ఎంత భారీగా ఉంటుందో తాజా వ్యవహారంతో అందరికి అర్థమైన పరిస్థితి. పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే.. ఈ అంశంపై కేంద్రహోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేసిన ఒక పొరపాటు కొంత గందరగోళానికి దారి తీసింది.
పటాన్ కోట్ వ్యవహారంలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే.. వీరిని ఐదుగురిగా పేర్కొంటూ రాజ్ నాథ్ సింగ్ తన ట్వీట్ లోకోట్ చేశారు. ఉగ్రవాదులందరిని హతమార్చిన తర్వాత.. భద్రతా దళాల్ని అభినందిస్తూ రాజ్ నాధ్ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని.. వారిని మట్టు బెట్టిన భద్రతాదళాల్ని అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
దీంతో అప్పటివరకూ మీడియాలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు చంపేశాయన్న వార్తల స్థానంలో ఐదుగురు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. ఇప్పటివరకూ చనిపోని వారిని చంపేసే వైనం కొన్ని మీడియా సంస్థల పుణ్యమా అని వింటున్నాం. చివరకు కేంద్ర హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సైతం తన తప్పుడు ట్వీట్ పుణ్యమా అని నలుగురు ఉగ్రవాదుల స్థానే ఐదుగురు ఉగ్రవాదుల్ని చంపినట్లుగా పేర్కొన్నారు. చివరకు తన తప్పును తెలుసుకొని.. తప్పుగా పోస్ట్ చేసిన ట్వీట్ ను ఉప సంహరించుకున్నారు. అసలే లేని ఐదో ఉగ్రవాదిని కేంద్రమంత్రి రాజ్ నాధ్ చంపేసినట్లుగా లెక్కలో వేసుకోవాలా? అన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.