తెలంగాణలో మహమ్మారి వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. కేసుల నమోదులో తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణ రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా 500కు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఏకంగా 546 పాజిటివ్ తేలాయి. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. శనివారం 3,188 నిర్ధారణ పరీక్షలు చేయగా 546 కేసులు వచ్చాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు 203 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,072కు చేరాయి.
తాజా కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 458 నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్‌లో 13, జనగామలో 10, మేడ్చల్‌లో 6, మహబూబ్ నగర్‌లో 3, వరంగల్ అర్బన్‌లో 2 వరంగల్ రూరల్‌లో 1, ఖమ్మంలో 2, ఆదిలాబాద్‌లో ఒక్క కేసు నమోదైందని బులెటిన్‌లో తెలిపారు.
చికిత్స పొంది తాజాగా 154 మంది డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి సంఖ్య 3,506 మంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3,363మంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53,757 పరీక్షలు మాత్రమే చేశారు. మొత్తం 50 వేలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆ మేరకు పరీక్షలు పెరిగాయి. ఈ పరీక్షల సంఖ్య మరింత పెంచాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.