తాను చనిపోయినా ఇంకొకరు బతికి ఉండాలనే దయా హృదయం కొందరికే ఉంటుంది. తన అవయవాలతో వేరొకరికి ప్రాణం ప్రోసేందుకు ఇటీవల చాలా మందికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కళ్లు, ఇతర అవయవాలు తాము చనిపోయిన తరువాత ఇచ్చేందకు ఒప్పందం చేసుకుంటున్నారు.
కానీ 55 ఏళ్ల మహిళ తను మరణించినా తనలో అవసరముండే అవయావాలన్నీ దానం చేసి వారి కుటుంబం గొప్ప మనసు చాటింది. ఇటీవల బ్రెయిన్ డెడ్ తో మరణించగా తన శరీరంలో 7 రకాల అవయవాలను సేకరించారు. ఆమె చనిపోయినా ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిందని అంటున్నారు.
అవయవదానం అన్నది అన్నింటి కంటే గొప్పది. అందుకే అందరూ దానిపై అవగాహన పెంచుకోవాలని అందరూ సూచిస్తుంటారు. ఇప్పటికీ ఎంతో మంది బాధితులు అవయవాలు పాడై ఆస్పత్రుల్లో అంపశయ్యపై ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయిన బాధితుల నుంచి వీటిని వారి కుటుంబాల అనుమతితో సేకరిస్తున్నారు.
55ఏళ్ల మహిళ గుండెను తాజాగా 15 ఏళ్ల బాలుడికి విజయవంతంగా అమర్చారు. ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడు గత ఏడాదిన్నర నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడి గుండెను మార్చాలని వైద్యులు తెలిపారు.
మరో ఆస్పత్రిలో 55 ఏళ్ల మహిళ.. బ్రెయిన్ డెడ్ తో మరణించడంతో ఆమె గుండెను ఈ బాలుడికి అమర్చాలనుకున్నాడు. రెండు ఆస్పత్రుల మధ్య ఉన్న 9.2 కి.మీల దూరాన్ని గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 14 నిమిషాల్లోనే చేరుకున్నారు. వెంటనే ఆ బాలుడికి మహిళ గుండెను అమర్చి అతడిని కాపాడారు.
అనుకోని ప్రమాదంలో తమ అమ్మాయి మరణించినందుకు బాధపడినా.. ఆమె అవయవాలు ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు సంతోషించారు. అయితే ప్రతి ఒక్కరు తమ అవయవదానానికి ముందుకు రావాలని కొందరుపిలుపు నిస్తున్నారు. పుట్టుకతోనో.. ఇతర కారణాల వల్లోనే కొన్ని అవయవాలు కోల్పోయిన వారు తమ జీవితంలో నరకం అనుభవిస్తారు. ఇలాంటి అవయవదానం వల్ల వారి జీవితాల్లో వెలుగు నింపినట్లవుతుందని అభిప్రాయ పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.