తెలంగాణకు మహర్దశ.. కొత్తగా 6 ఎయిర్ పోర్టులు

Update: 2021-01-20 16:04 GMT
తెలంగాణకు హైదరాబాద్ తప్పితే మరో అంతర్జాతీయ నగరం లేదు. మరో విమానాశ్రయం లేదు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలు కూడా కార్పొరేషన్లే. కానీ ఎక్కడా విమానాశ్రయాలు లేవు.

అదే ఏపీలో విజయవాడతోపాటు విశాఖ, తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలున్నాయి. తెలంగాణలో కేవలం హైదరాబాద్ కే అంతా అభివృద్ధి కేంద్రీకృతమైంది. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలే తెలంగాణకు దిక్కు. జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే హెలీక్యాప్టర్ రోడ్డు మార్గాలే దిక్కు. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు తెలంగాణ జిల్లాల పర్యటనకు వచ్చినా కూడా వారు నేరుగా రావడానికి విమాన సౌకర్యం లేదు. దీంతో హెలీకాప్టర్ లోనే వస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే హెలీకాప్టర్ పనిచేయక రాత్రివేళ రోడ్డు మార్గాన వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో లాగానే తెలంగాణలోనూ హైదరాబాద్ మినహాయిచి ఎయిర్ పోర్టులు నిర్మించాలని తాజాగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

ఈ మేరకు సీఎం కేసీఆర్ కేంద్రవిమానయాన శాఖకు రిపోర్టు పంపించారు. దానికి సమాధానంగా తాజాగా కేంద్రం ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ఓ రిపోర్టు సమర్పించింది. రాష్ట్రంలో కొత్త ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో మూడు గ్రీన్ ఫీల్డ్, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు వస్తాయి.

ప్రస్తుతం తెలంగాణ మినహా ఎక్కడా విమాన సేవలు లేవు. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో విమానంలో ఒక్కరోజులోనే సుదూర ప్రాంతాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకుంటున్న కాలం. మున్ముందు విమానయాన రంగానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప భవిష్యత్ ఉంది. అందుకే తెలంగాణ సర్కారు రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక సహా పక్క రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఎయిర్ పోర్టులు చాలా తక్కువ. అందుకే తాజాగా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

తెలంగాణలో కొత్తగా ఆదిలాబాద్, మమ్మూర్, పెద్దపల్లి బసంత్ నగర్ జక్రాన్ పల్లి, గుడిబండ, ,కొత్తగూడెంలో లో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ఉడాన్ పథకం కింద వీటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు అధ్యయనం చేయాలని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించారు. సెప్టెంబర్ కల్లా నివేదిక వచ్చాక తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు రానున్నాయి.




Tags:    

Similar News