తండ్రి కోసం సాంగ్.. కేటీఆర్ కొడుకా మజాకా..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు హిమాన్షు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు.

Update: 2024-12-28 11:15 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు హిమాన్షు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయా రంగాల్లో సత్తాచాటుతూ వస్తున్నాడు హిమాన్షు. తాజాగా.. తన తండ్రి కోసం ఓ సాంగ్ పాడాడు.

హిమాన్షు వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను చాటాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే.. ఎన్నికల సమయంలోనూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా పనిచేశాడు. గతేడాది ఓ ఇంగ్లిస్ సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక.. తాజాగా తన తండ్రి కేటీఆర్ పట్ల ఉన్న ప్రేమను మరోసారి చాటాడు. ఏకంగా ఓ పాట పాడి ఆకర్షించాడు.

కేటీఆర్ బర్త్‌డే జూలైలోనే ఉంది. ఆ సందర్భంలోనూ హిమాన్షు ఓ పాట పాడాడు. యానిమల్ మూవీలోని ‘నా సూర్యుడిని నా చంద్రుడిని’ అనే పాటను రికార్డు చేసి వినిపించాడు. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా రీక్రియేట్ చేశాడు. ఆ పాటలో తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను యాడ్ చేసి వీడియోను రూపొందించారు. ఆ పాటను కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కానీ.. దానిని సంతృప్తికరంగా రిలీజ్ చేయలేదని చెప్పారు. తాను సైతం వారం క్రితం మొదటిసారి పాటను విన్నానని... హిమాన్షు గానం, పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉందని కొనియాడారు.

ప్రస్తుత కష్టతరమైన ఏడాదిలో తనకు దక్కిన ఉత్తమ బహుమతి అని కేటీఆర్ హిమాన్షును ప్రశంసించారు. తన గాత్రంతో ఉత్తమ బహుమతి అందించిన బింకుకి థాంక్స్ చెప్పారు. ఓ తండ్రిగా తాను ఎంతగానో గర్వపడుతున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News