బ్రేకింగ్ : ఏపీలో మరో 62 కరోనా పాజిటివ్ కేసులు!

Update: 2020-05-02 07:15 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,525కి చేరింది. ఇప్పటి వరకూ మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 441 మంది కోలుకున్నారు.  

రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇకపోతే, ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 కేసులు నమోదు అయ్యాయి.

గత వారం నుంచి రోజూ దాదాపు 60 నుంచి 80 కేసుల దాకా నమోదవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ర్యాపిడ్ టెస్టుల వల్లే అధిక సంఖ్య లో పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి అని చెప్తుంది. ఇకపోతే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు అంటే మే 17 వరకు పొడగిస్తునట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జోన్ల వారీగా విభజించి ..కొన్ని సడలింపులు ఇవ్వనుంది. ఏపీలో రెడ్ ‌జోన్లో  కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఉన్నాయి.  ఆరెంజ్‌ జోన్ ‌లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి. గ్రీన్‌ జోన్ ‌లో విజయనగరం ఉంది
Tags:    

Similar News