వరుడు 67 - వధువు 24..వాళ్ల భద్రత కోసం కోర్టు!

Update: 2019-02-08 16:52 GMT
ప్రేమ‌కు ఎల్ల‌లు లేవు. వ‌య‌సు అడ్డుఊ అదుపు కాదు అనే మాట‌ను మ‌నం ఎన్నో సార్లు విన్నాం. ప‌లు ఉదంతాల్లో చూశాం. అలాంటి ఉదంత‌మే ఇది. అయితే, ఇందులో ఆనేక ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు ఉన్నాయి. ఈ ప్రేమికుడి వయ‌సు 67 సంవ‌త్స‌రాలు - వధువు వ‌య‌సు 24. కచ్చితంగా చెప్పాలంటే వరుని వయసులో వధువు వయసు సుమారు మూడోవంతు ఉంటుంది. ట్విస్టు ఇక్క‌డితోనే ఆగిపోలేదండోయ్‌...వాళ్ల భద్రత కోసం సాక్షాత్తు కోర్టు రంగంలోకి దిగింది.

వివ‌రాల్లోకి వెళితే....పంజాబ్‌ లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన షంషేర్ - నవప్రీత్ పెళ్లి చేసుకున్నారు.ధూరీ సబ్‌ డివిజన్‌ లోని బలియాన్ గ్రామానికి చెందిన ఈ ఇద్దరు వింత వివాహం చేసుకోవడం పెద్దవార్త అయింది. సామాజిక మాధ్యమాల్లో వీరి ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. చండీగఢ్‌ లోని ఓ గురుద్వారాలో వీరు ఒక్కటయ్యాయరు. కాటికి కాళ్లుచాచిన షంషేర్ - ప్రాయంలో ఉన్న నవనీత్ పెళ్లి చేసుకోవడం ఇరుకుటుంబాల వారికీ ఏమాత్రం ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల నుంచి - బంధువుల నుంచి తమకు ముప్పు ఉందని నవదంపతులిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లే కనుక వారి పెళ్లిపట్ల ఎలాంటి అభ్యంతరం తెలుపని కోర్టు వారికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై షంషేర్-నవప్రీత్ దంపతులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వారి న్యాయవాది మాత్రం వివాహం చట్టబద్ధమైందే అని చెప్పారు. ఇద్దరికీ సజీవులైన జీవిత బాగస్వాములు లేరు కనుక ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.అయితే,  తాము ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని, తమ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని షంషేర్‌ కుటుంబ సభ్యులు వాపోవ‌డం కొస‌మెరుపు.
Tags:    

Similar News