టెలికాం రంగంలో మనం దేశం దూసుకుపోతోంది. రెండో జనరేషన్ తర్వాతి నుంచి అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ప్రస్తుతం ఐదో తరం అందుబాటులో ఉంది. అయితే అతి త్వరలో ఆరో తరం కూడా రాబోతుంది. ఆ దిశంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా మనదేశంలో ఈ 6జీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ డిపార్టుమెంట్ వెల్లడించింది. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రపంచదేశాల్లో ముందుగా మనదేశంలోనే తీసుకురావడానికి భారత్ సిద్ధమైంది. అందుకే 6జీ టెక్నాలజీ ఇన్నోవేష్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. 6జీ సాంకేతికతను మనదేశంలో అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డీవోటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం శరవేగంగా దీనిపై సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆరో జనరేషన్ ఏర్పాటు చేసిన టీఐజీలో వివిధ సంస్థలను భాగస్వామ్యం చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో భారత ప్రభుత్వం, అకాడెమియా, ఇంటస్ట్రీ అసోసియేషన్, టెలికాం స్టాండర్స్ డెవలప్ మెంట్ సొసైటీ ఆఫ్ ఇండియాలు సభ్యులుగా ఉంటాయని టెలికాం డిపార్టుమెంట్ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేయడానికి సైంటిస్టులు, ఇంజినీర్లకు అన్నిరకాల అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు.
6జీని అందిపుచ్చుకోవడానికి తయారీ, సేవల సంస్థను సిద్ధం చేసేందుకు దేశీయంగా ఉన్న అన్నిరకాల పరిజ్ఞానాలను ఇవ్వనున్నట్లు డీఓటీ వెల్లడించింది. దేశీయ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, ఇతర సాంకేతికత డేటాను సాయంతో 6జీ సాంకేతికతను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వైష్నావ్ గతంలో వెల్లడించారు. ఇకపోతే అతి త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని ఇదివరకే తెలిపారు. కాగా ప్రపంచంలోనే తొలిసారిగా మనదేశంలో ఈ 6జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడం చెప్పుకోదగిన అంశమే.