ఢిల్లీ అల్లర్లపై చర్చ కోసం కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో నేడు లోక్ సభ అట్టుడికిపోయింది. మార్చి 11న ఆ అంశంపై చర్చిద్దామని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చెప్పినప్పటికీ.... విపక్షాలు సభలో గందరగోళం రేపాయి. ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాల్సిందేనంటూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో బీజేపీ - కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. తమ స్థానాల్లోకి వెళ్లాలని - లేకుంటే సస్పెండ్ చేస్తానని స్పీకర్ విపక్ష సభ్యులను హెచ్చరించారు. అయినప్పటికీ...వారు వినకుండా పోడియం వైపు దూసుకువచ్చి నినాదాలు చేశారు. కూర్చోవాల్సిందిగా పలు మార్లు స్పీకర్ కోరినప్పటికీ సభ్యులు వినలేదు. అంతేకాకుండా, స్పీకర్ చైర్ ను అవమానిస్తూ స్పీకర్ ఓంబిర్లాపై కొన్ని పేపర్లను చింపి విసిరారు. ఈ ఘటన తర్వాత తీవ్ర మనస్తాపానికి లోనైన స్పీకర్ ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.
లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గగోయ్ - టీఎన్ ప్రతాపన్ - డీన్ కురియ కోస్ - ఆర్ ఉన్నతన్ - మణిక్కమ్ ఠాగూర్ - బెన్నీ బెహ్నన్ - గుర్జీత్ సింగ్ ఔజ్లాలలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై కొన్ని పేపర్లను చింపి విసిరేశారు. ఈ ఘటనతో స్పీకర్ ఓం బిర్లా మనస్తాపానికి గురయ్యారు. క్రమశిక్షణా చర్యల కింద ఆ ఏడుగురిని సస్పెండ్ చేశారు. తమ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయం స్పీకర్ ది కాదని లోక్ సభా విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. సస్పెన్షన్‌కు బెదరబోమని, తమ పోరాటం కొనసాగుతుందని అధిర్ రంజన్ చెప్పారు. అనురాగ్ ఠాకూర్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.