హైదరాబాద్ లో వారియర్స్ ను వరుస పెట్టి బలి తీసుకుంటోంది

Update: 2020-06-24 03:30 GMT
పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ మహానగరానికి తాజాగా కొత్త కష్టం మొదలైంది. గతంతో పోలిస్తే.. గడిచిన వారం వ్యవధిలో మహానగరంలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతోంది. అదే సమయంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొదట్లో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు తక్కువగా ఉండేవి. లాక్ డౌన్ తర్వాత మరణాల సంఖ్య కాస్త పెరగ్గా.. అన్ లాక్ 1.0 తర్వాత మాత్రం సంఖ్య అంతకంతకూ ఎక్కువైంది.

విషాదకరమైన విషయం ఏమంటే.. ఇటీవల కాలంలో మరణిస్తున్న వారిలో కరోనా వారియర్స్ ఫ్రంట్ లైన్ కు చెందిన వారు ఉండటం. సోమవారం విషయానికే వస్తే.. ఖైరతాబాద్ లో గడిచిన కొన్నేళ్లు గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మరణించారు. అంతేకాదు.. నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోవటం మింగుడు పడటం లేదు.

మహమ్మారిని నియంత్రించే విధుల్ని నిర్వహిస్తున్న వారియర్స్ ను సైతం విడిచి పెట్టటం లేదు. గడిచిన కొద్ది రోజులు గా చూస్తే.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వైద్యులు.. పోలీసులు.. మీడియా సిబ్బంది మాయదారి రోగానికి గురి కావటం తెలిసిందే. తాజాగా మరణాలు కూడా పెరగటంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కొత్త భయాన్ని కలిగిస్తోంది. 
Tags:    

Similar News