కరోనా విలయం: ఇండియాలో 80శాతం ఆ కేసులే

Update: 2020-04-27 00:30 GMT
కరోనా వైరస్ దేశంలో విపరీతంగా వ్యాపిస్తోంది. కొత్త కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 27వేలకు చేరింది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా 80శాతం అసింప్టమాటిక్ (లక్షణాలు కనపించని) కేసులేనని సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ తరహా కేసులపై కేంద్రం ఆందోళన చెందుతోంది.

అసింప్టమాటిక్ అంటే కరోనా సోకిన లక్షణాలు కనిపించని స్థితిని ఇలా అంటారు. కరోనా రోగ లక్షణాలు బయటపడకుండా వ్యాధికి గురికావాడన్నే అసింప్టమాటిక్ అంటారు. వ్యాధి లక్షణాలు బయటపడ్డ వారికే ప్రస్తుతం దేశంలో చికిత్స చేస్తున్నారు. కానీ కరోనా వచ్చి తెలియకుండా లక్షణాలు బయటపడకుండా చాలా మంది తిరుగుతున్నారు. వారి ద్వారా వేరొకరికి వైరస్ వ్యాపిస్తూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని బలితీసుకుంటుంది.

దేశంలో కరోనా పాజిటివ్ గా తేలుతున్న వారిలో నూటికి 80శాతం మందికి కరోనా లక్షణాలైన దగ్గు -జలుబు - తుమ్ములు - జ్వరం ఉండకపోవడం డేంజర్ గా వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 80శాతం కేసులు అలాంటివేనని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.

ఇలా అసింప్టమాటిక్ కేసులతో దేశంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.అసింప్టమాటిక్ కేసుల దృష్ట్యా దేశంలో ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను పెంచి కరోనాను అరికట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోడీకి సూచించారు. పేదలకు రేషన్ - డబ్బులు ఇవ్వాలని కోరారు.

   

Tags:    

Similar News