మోడీ ఎంచుకున్న 'న‌వ‌'ర‌త్నాలు వీరే

Update: 2017-09-03 06:19 GMT
2019 ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. అమిత్ షా ద్వ‌యం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో క‌స‌ర‌త్తు మీద క‌స‌ర‌త్తు చేసి సిద్ధం చేసిన లిస్ట్ అధికారికంగా రివీల్ అయ్యింది. కేంద్ర కేబినెట్ ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్న‌ట్లుగా కొద్ది రోజులుగా వార్త‌లు వస్తున్న‌ప్ప‌టికీ.. అది నిజం చేస్తూ.. తాజాగా విస్త‌ర‌ణ అంకాన్ని పూర్తి చేశారు మోడీ. ఎంత‌మందికి ప‌ద‌వులు ల‌భిస్తాయ‌న్న విష‌యంపై ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడోసారి విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టిన మోడీ.. ఈసారి ఎంపిక‌లో త‌న మార్క్‌ ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. మిత్ర‌ప‌క్షాల డిమాండ్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా తన ప్లాన్‌ కు త‌గ్గట్లుగా కేబినెట్ ఎంపిక చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ రోజు (ఆదివారం) ఉద‌యం 10.30 గంట‌ల‌కు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో కొత్త‌గా 9 మంది మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అదే స‌మ‌యంలో మ‌రో న‌లుగురు స‌హాయ మంత్రుల‌కు ప్ర‌మోష‌న్ ఇస్తూ వారికి కేబినెట్ లో స్థానం ఇచ్చారు.
ఘ‌నంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రుల్ని ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు.

ఇక‌.. విస్త‌ర‌ణ‌లో చోటు ద‌క్కించుకున్న తొమ్మిది మంది ఎవ‌రంటే..

1. అశ్వినికుమార్‌ చౌబే

2. గజేంద్ర సింగ్‌ షెకావత్‌

3. శివప్రతాప్‌ శుక్లా

4. హర్దీప్‌సింగ్‌ పూరి

5. సత్యపాల్‌ సింగ్‌

6. రాజ్‌ కుమార్‌ సింగ్‌

7. అల్ఫోన్స్‌ కన్నన్‌

8. వీరేంద్రకుమార్‌

9. అనంత్‌ కుమార్‌ హెగ్డే

ప్ర‌మోష‌న్ పొందిన స‌హాయ‌మంత్రులు వీరే..

1.  నిర్మలా సీతారామన్‌

2.  ధర్మేంద్ర ప్రధాన్‌,

3.  పీయూష్‌ గోయల్‌

4. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి 
Tags:    

Similar News