కలెక్టర్‌ జట్టులాగిన కార్యకర్తలు ..చెంప చెళ్లుమనిపించిన కలెక్టర్ !

Update: 2020-01-20 05:07 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు విపక్షాలు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆందోళనలు నిర్వహిస్తుంటే - మరోవైపు బీజేపీ మాత్రం ఈ చట్టానికి మద్దతు ర్యాలీలు నిర్వహిస్తుంది. ఇలా ఈ సీఏఏ కు అనుకూలంగా మధ్యప్రదేశ్‌ లో తాజాగా  బీజేపీ కార్యకర్తలు చేపట్టిన మద్దతు ర్యాలీ హింసాత్మకంగా మారింది. దీనితో  నిరసనకారులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రియావర్మ పై బీజేపీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఆమె  ఆందోళనకారులను చెదరగొడుతున్న  సమయంలో  అడ్డుకుని జుట్టుపట్టి  లాగారు. దీనితో రెచ్చిపోయిన  డిప్యూటీ కలెక్టర్‌ ప్రియావర్మ ..జట్టుపట్టిలాగిన వారిని గుర్తించి చెంపచెళ్లుమనిపించింది.

పూర్తి వివరాలు చూస్తే ... మధ్యప్రదేశ్ లోని  రాజ్‌ గఢ్‌ జిల్లా ప్రధాన రహదారిపై సీఏఏకు మద్దతుగా ఆదివారం బీజేపీకి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అయితే దీనికి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో  ఆందోళనకారులు - పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. వెంటనే ఈ  విషయం తెలిసుకున్న డిప్యూటీ కలెక్టర్‌ ప్రియావర్మ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఆందోళకారులను పట్టుకుని పోలీసు వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చి ఆమె జుట్టుపట్టి లాగి దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది కలెక్టర్‌ ను చుట్టుముట్టి కాపాడారు.  అయితే ఆ తరువాత  కొద్దిసేపటికి ఆమె జుట్టులాగిన  పోకిరిని గుర్తించిన పాలానాధికారి.. వాడి కాలర్‌ పట్టుకొని చెంప చెల్లుమనిపించారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ ఆ వ్యక్తి పై  తీవ్ర ఆగ్రహం చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటన పై తీవ్రంగా స్పందించింది.
Tags:    

Similar News