‘‘గాంధీని చంపింది ఓ పిచ్చోడు’’

Update: 2016-01-31 06:30 GMT
తమపై విపక్షాలు బలంగా దాడి చేసే అంశాలపై అంతే బలంగా రియాక్ట్ కాకపోవటం బీజేపీకి ఉన్న బలహీనతల్లో ఒకటిగా చెప్పొచ్చు. కొన్ని అంశాల్లో విపక్షాలు ఆరోపించినట్లుగా తమకేమాత్రం సంబంధం లేకున్నా.. ఆ విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పటం..తమను రాజకీయంగా దెబ్బ తీసే అంశాలపై వివరణ ఇవ్వటం లాంటివి పెద్దగా వినిపించవు.

జాతిపిత గాంధీజీని హత్య చేసిన గాడ్సే విషయంలో ఆర్ ఎస్ ఎస్ సమర్థిస్తుందన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది. నిజానికి గాంధీని చంపిన విషయంలో గాడ్సే పైన ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ సమర్థించింది లేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. గాంధీని చంపిన గాడ్సే ప్రస్తావనతో ఆర్ఎస్ ఎస్ ను దెబ్బ తీయాలన్న ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగిందే. ఎందుకంటే.. గాడ్సే అంతకు ముందు ఆర్ఎస్ ఎస్ కు ఫాలోయర్ కాబట్టి. గాంధీని చంపే సమయానికే ఆర్ఎస్ ఎస్ నుంచి బయటకు వచ్చేసిన గాడ్సే.. గాంధీని చంపాలన్న ఉద్దేశం తన వ్యక్తిగత అంశంగా చెప్పుకోవటం పైకి కనిపించదు.

ఇంతకీ రాజకీయ పక్షాలు ఆర్ ఎస్ ఎస్ ను అంతగా టార్గెట్ ఎందుకు చేస్తాయంటే.. సదరు సంస్థ ఐడియాలజీ అంతా బీజేపీ వంట బట్టించుకుందన్న వాదనతోనే. అయితే.. గాడ్సేతో ఆర్ ఎస్ ఎస్ తో పాటు బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని ఇప్పటికి సూటిగా తేల్చి చెప్పిన వారు లేరు. ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు కేంద్రమంత్రి ఉమాభారతి. హిందుత్వ నేతగా అందరికి సుపరిచితురాలైన ఆమె.. తాజాగా గాడ్సే మీద విరుచుకుపడ్డారు.

గాంధీ వర్థంతిని పురస్కరించుకొని గాడ్సే మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతిపిత గాంధీజీని ఓ పిచ్చివాడు చంపేశాడంటూ ఆమె మండిపడ్డారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికీ  శాశ్వితంగా నిలిచి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ వైరిపక్షం గాడ్సేకు. ఆర్ ఎస్ ఎస్ కు బీజేపీకి సంబంధం లేదన్న విషయాన్ని గుర్తిస్తారా? లేక.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాల్ని వక్రీకరిస్తారా?
Tags:    

Similar News