ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి.. సినీ నటి పూనంకౌర్ లను సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వైనంపై గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడితో పాటు.. మరో వ్యక్తి కూడా ఈ పాడుపనిలో భాగస్వామిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది.
దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాస్తున్నది ఎందుకన్న విషయంపై నిందితులు అదుపులోకి తీసుకుంటే కానీ చెప్పలేమంటున్నారు పోలీసులు. డబ్బు కోసం ఇలాంటి పని చేస్తున్నారా? లేదంటే వ్యక్తిగతంగా కక్ష కట్టి ఇలాంటివి చేస్తున్నారన్నది తేలాల్సి ఉంది. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని సైబర్ పోలీసులు చెబుతున్నారు.
తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా కొందరు వ్యక్తులు ఫేస్ బుక్.. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు.. అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్న వైనాన్ని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు.