భారీ విధ్వంసం సృష్టించిన హైపర్ సోనిక్ క్షిపణి

Update: 2022-03-20 07:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుంది. తాజాగా ఉక్రెయిన్ సైనిక బ్యారెక్స్ పై ఏకంగా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించటమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఎక్కడో భూగర్భంలోని ఆయుధాగారంపై రష్యా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. దీని దెబ్బకు ఆయుధగారమంతా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది. నాటో దేశాల నుండి వచ్చిన ఆయుధాలన్నింటినీ తమ క్షిపణ నాశనం చేసినట్లు రష్యా సైన్యాధికారులు ప్రకటించారు.

అలాగే క్షిపణి దెబ్బకు బ్యారెక్స్ లో ఉన్న సైనికుల్లో ఎంతమంది చనిపోయారో క్లారిటి లేదు. ఎందుకంటే క్షిపణిని ప్రయోగించిన సమయంలో బ్యారెక్స్ లో 200 మంది సైనికులు నిద్రపోతున్నారట. ఇప్పటికి బయటపడిన లెక్కల ప్రకారం 50 దేహాలు లెక్కతేలింది. మిగిలిన వారిలో ఎంతమంది బతికారు ? ఎంతమంది పోయారనే విషయంపై క్లారిటీ రాలేదు. యుద్ధంలో రష్యా హైపర్ సోనిక్ లాంటి ప్రమాదకరమైన క్షిపణిని ప్రయోగించటం ఇదే మొదటిసారి.

ఇప్పటివరకు ఏదో మామూలు సంప్రదాయ ఆయుధాలను మాత్రమే ప్రయోగిస్తోంది. అందులోను ఆర్మీ సైనికులనే ముందు పెట్టి యుద్ధం చేస్తోంది. ఇప్పుడిప్పుడే వైమానిక దళాన్ని రంగంలోకి దింపింది. దీనివల్ల ఉక్రెయిన్లోని కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దళం ప్రయోగిస్తున్న బాంబుల దెబ్బకే నగరాల్లోని చాలా ప్రాంతాలు ధ్వంసం అయిపోతున్నాయి. అలాంటిది ఇపుడు మొదటసారి హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించింది.

రష్యా ప్రయోగించిన తాజా క్షిపణిపై నాటో దేశాలు, అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో రష్యా కూడా నాటో దేశాలతో పాటు అమెరికాపై మండిపడుతోంది. ఉక్రెయిన్ కు అందించిన ఆయుధాలను ప్రశ్నిస్తోంది. నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలను అందిస్తే తప్పులేనిది తాము హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగిస్తే తప్పేమిటి ? అంటు ఎదురు ప్రశ్నిస్తోంది. మొత్తానికి మరో నాలుగు రోజులు రష్యా ఇలాంటి ప్రమాదకరమైన క్షిపణులను ప్రయోగిస్తే మొత్తం ఉక్రెయిన్ ధ్వంసం అయిపోతుందేమో.
Tags:    

Similar News