సుప్రీంకోర్టు చీవాట్లు.. హెచ్చరికలు, కేసుల కొట్టివేతలతో కేంద్రం దిగివచ్చింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో యాక్టివిస్టులపై పెట్టిన కేసులకు చెక్ పడింది. సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వారిపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టిన కేసులు మాఫీ అవుతున్నాయి.
సెక్షన్ 66ఏ.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని ఐటీ చట్టం 66ఏ కింద అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా ఉంది. ఈ చట్టం పేరిట సోషల్ మీడియా నెటిజన్లపై పెడుతున్న కేసులను సుప్రీంకోర్టు ఆరేళ్ల క్రితమే కొట్టివేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాకు సుప్రీం ఊపిరినిచ్చింది. అయితే ఇంకా దేశంలో ఆయా రాష్ట్రాలు ఈ కేసులను పెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చట్టం ఎందుకు రద్దు చేయలేదని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్ర హోంశాఖ తాజాగా స్పందించింది. ఈ కేసులన్నీ ఎత్తివేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టం ప్రకారం ఇప్పటికీ కొన్ని కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తున్నట్టు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసుసిబ్బందికి సమాచారం ఇవ్వాలని 2019లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంకా పలు చోట్లు కేసులు నమోదు కావడం ఇది చాలా దారుణమైన పరిణామం అని అభివర్ణించింది. దీనిపైనే విచారణ చేపట్టి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్నిఆశ్రయించింది.ఈ సెక్షన్ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని.. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో కోరింది.
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దిగ్భ్రాంతికరం అని.. దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ ప్రమాదకర కంటెంట్ ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66 ఏ కింద అరెస్ట్ చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015 లో దీనిపై సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏ ను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను ఎత్తివేయడమే పరిష్కారమని భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కేసుల బారిన పడిన అనేక మంది విముక్తికి లభిస్తోంది. అయితే లేని చట్టంపై కేసులు పెట్టి వేధించిన తీరు మాత్రం ఇప్పటికీ బాధితులు జీర్ణించుకోవడం లేదు.