అతిశయోక్తి కోసం చెప్పట్లేదు. చాలామందికి టన్నుల కొద్దీ లక్ ఉందనుకుంటాం. అలాంటి వారు సైతం.. అసూయ పడేంత సుడి ఇతగాడి సొంతం. ఇలాంటోళ్ల సుడి ఊహకు కూడా అందదు. ఇంతలా ఊరిస్తున్నారు.. ఇతగాడి వీర సుడి గురించి కాసిన్ని డిటైల్స్ చెప్పమంటారా? అక్కడికే వస్తున్నాం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో క్వామే క్రాస్ అనే వ్యక్తి ఉన్నాడు.
ఇతగాడికి లాటరీ టికెట్లు కొనాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. 7.. 3..1..4 అంకెల కాంబినేషన్ లో టికెట్లు కొన్నాడు అది కూడా ఏ రెండో.. మూడో కాకుండా ఏకంగా 160 టికెట్లు కొనేశాడు. ఆ తర్వాత ఫలితం వచ్చేసింది. తన దగ్గర ఉన్న టికెట్లు.. ఫలితాన్ని చూసుకున్న అతగాడికి ఒక పట్టాన జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే.. అతడు కొన్న 160 లాటరీ టికెట్లు బహుమతి సాధించటమే. ప్రతి సిరీస్ లోనూ గరిష్ఠ బహుమతిని ఇతడు సొంతం చేసుకున్నాడు.
అలా మొత్తం టికెట్లకు అతనికి వచ్చిన బహుమతి మొత్తం ఎంతో తెలుసా? మన రూపాయిల్లో అక్షరాల రూ.5.89 కోట్లు. ఫలితాన్ని చూసుకున్నంతనే నమ్మబుద్ధి కాలేదని.. అందుకే.. టికెట్లను 82 సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ అతడికి నమ్మకం కలగలేదట.
ఇంత భారీ మొత్తం బహుమతిగా వచ్చిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్నిఏం చేయబోతున్నావంటే.. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలని తాను డిసైడ్ అయినట్లుగా చెబుతున్నాడు. ఇక.. మిగిలిన డబ్బులతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదంటున్నాడు. ఇతగాడికి పట్టిన సుడి గురించి విన్నవారంతా ఆశ్చర్య పోతున్న పరిస్థితి. గతంలోనే రేమండ్ అనే వ్యక్తి కొన్న పాతిక టికెట్లకు లాటరీ తగిలిందట. ఇప్పటివరకుఅదే రికార్డుగా ఉంటే.. తాజాగా ఆ రికార్డును క్వామే బద్ధలుకొట్టేశాడు. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి సుడిగాడి గురించి మీరెప్పుడైనా విన్నారా?