9వ తరగతి చదివాడు.. కానీ టెక్నాలజీపై పట్టుపెంచుకున్నాడు. జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడిన అఖిల్ అనే యువకుడు ఏకంగా 3 ఏళ్లలో దాదాపు 200 మంది అమాయక యువతులకు వలవేసి వారిని లైంగికంగా దోచుకున్నాడు. వారితో శృంగార వాంఛలు తీర్చుకున్నాడు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పార్శ అఖిల్ 9వ తరగతి వరకు చదువుకొని మానేసి మూడేళ్ల హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చాడు. సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఒక హోంకేర్ సెంటర్ లో వార్డ్ బాయ్ గా అక్కడే నివాసం ఉంటున్నాడు.
హోంకేర్ సెంటర్ లో పనిచేసే నర్సులు, ఇతర మహిళా ఉద్యోగినుల ఫోన్ నంబర్లు సేకరించి తాను నగ్నంగా ఉండి వారికి వీడియో కాల్ చేసేవాడు. వారు ఫోన్ ఎత్తగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఆ ఫొటోలను వారికి వాట్సాప్ లో పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఫేస్ బుక్ ద్వారానూ ఇలా అమ్మాయిలకు వలవేసి ఫోన్ నంబర్లు సేకరించి వీడియో కాల్ తో ఈ విధంగా వేధించేవాడు.
తన దగ్గర మీ ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. తన లైంగిక కోరికలు తీర్చమని బెదిరించేవాడు. లొంగకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చాలా మంది యువతులు వీడి ఆకృత్యాలకు బలైపోయారు. కానీ నల్గొండకు చెందిన ఒక నర్సు వీడి ఆగడాలపై షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. దాదాపు 200మంది యువతులను ఇలానే లైంగికంగా దోచుకున్నట్టు వెల్లడించాడు. అఖిల్ పై హైదరాబాద్ లోనూ కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు.