ఈ వీడియోలో నిజం ఎంత? కొడాలి.. వల్లభనేని.. అంబటి నిర్మూలన కోసం రూ.50లక్షలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. విపక్ష నేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మీదా.. టీడీపీ నేతలపై విరుచుకుపడే మంత్రి కొడాలి నానితో పాటు.. వల్లభనేని వంశీలపై దారుణ రీతిలో వ్యాఖ్యలు చేశారన్నట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కార్తీక మాసంలో ఏపీలో ఎక్కువగా వన మహోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఒక వ్యక్తి చేసినట్లుగా ఉన్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎంత కుల సంఘం మీటింగ్ అయితే మాత్రం.. అంత ఓపెన్ గా రాష్ట్ర మంత్రిని.. మరో కీలక నేతతో పాటు.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును హత్య (వీడియోలో ఈ పదాన్ని అనకుండా నిర్మూలించటం అనటం వినిపిస్తుంది)చేయటానికి వీలుగా ఎవరైనా ముందుకు వస్తే వారికి తన వంతుగా రూ.50లక్షలు ఆర్థిక సాయం చేస్తానన్న మాట అన్నట్లుగా ఉంది.
దగ్గరదగ్గర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఏమున్నదన్నది? అందులో మాట్లాడుతున్న వ్యక్తం ఏ మాట్లాడారు? అన్నది యథాతధంగా తీసుకుంటే..‘మనల్ని మనం కూడా ఫ్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. కులంలో ఉన్న కొన్ని చీడపురుగులు కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. అలాంటోళ్లే కాకుండా మదపటేనుగుల మాదిరి వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు.. ఇలాంటి వాళ్లను కూడా మనం కూడా ఒక ఆపరేషన్ నిర్వహించి భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దాని కోసం అవసరమైతే.. అటువంటి ప్రాజెక్టును ఎవరైనా చేపడితే..దానికోసం ఈ వేదిక నుంచి నా వంతుగా ఆర్థిక చేయూతను ఇస్తా. చరూ.50లక్షలు ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా. ఎందుకంటే మొన్న జరిగిన క్యారెక్టర్ అసాసినేషన్ మామూలుది కాదు. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అలాంటివి కూడా చూస్తారు’ అనటం కనిపిస్తుంది.
అయితే.. వినిపించే మాటకు.. వీడియోలో ఉన్న వ్యక్తి కదలికలకు మధ్య మిల్లీ సెకన్ల తేడాగా ఉండటం.. వ్యక్తి ముఖం సరిగా కనిపించకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి.. సదరు వీడియో మీద పోలీసులకు ఫిర్యాదు అందిందని.. దానిపై విచారణ చేపట్టినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇది నిజమైన వీడియోనా? లేదంటే అధికార పార్టీని డ్యామేజ్ చేసేందుకు వైసీపీపార్టీ ముద్ర ఉండేలా చేసిన వీడియోనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. ఈ తరహా వీడియోలతో లేని ఉద్రిక్తతలకు కారణమవుతుందన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వాటిని ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ ఈ వీడియో నిజమైతే.. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Full View