టిక్ టాక్ లో వైరల్ అవుతోన్న కొత్త ఛాలెంజ్ ...ట్రై చేస్తే ప్రాణాలు గాల్లోకే !
సోషల్ మీడియాలో రోజు రకరకాల ఛాలెంజ్‌లు, గేమ్ లు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు చూడటానికి ఉన్నా.. కొన్ని మాత్రం చాలా ప్రమాదకరం. మరికొన్ని అయితే , ఏకంగా కొందరి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో వస్తున్న కొన్ని ఛాలెంజ్ లు ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగామరో డేంజర్ ఛాలెంజ్ వచ్చింది. అదే స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ .
అసలు ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటే ఏమిటి అంటే .... స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. అందరూ ఒకేసారి పైకి ఎగరాలి. అయితే ఇరు పక్కల ఉన్నవారు, మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఎగిరిన సమయంలో వాళ్లు ఎగరకుండా, చెరో కాలితో మధ్యలో ఉన్న వ్యక్తి కాళ్లను ముందుకు తంతారు. దీనితో ఎగిరిన వ్యక్తి వెల్లకిలా పడిపోతాడు. దీనితో ఆ శరీరం మొత్తం భారం నడుము, వెన్నుపూస, తలపై పడుతుంది. ఇది చాలా ప్రమాదకరం అని , ఈ ఛాలెంజ్ కారణంగా.. వెన్నుముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి ఈ ఛాలెంజ్ వల్ల ప్రాణం కూడా పోవచ్చు అని చెప్తున్నారు. ఇది పబ్జీ(pubg) కన్నా ప్రమాదకరమైంది.
ఈ ఛాలెంజ్ ప్రస్తుతం టిక్ టాక్ లో వైరల్ అవుతుండగా ..పలువురు దీన్ని ఫాలో అవుతున్నారు. అయితే , ఈ ఛాలెంజ్ వల్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని , ఈ గేమ్ జోలికి పోకుండా ఉండటమే మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి రిస్కీ ఛాలెంజ్ లో పాల్గొనకుండా తల్లిదండ్రులే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాలెంజ్ ని స్వీకరించడంలో తప్పులేదు కానీ , ఆ ఛాలెంజ్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకోవడం మంచిది కాదు.