రష్యా ప్రథమ మహిళ ఈమేనా?

Update: 2018-12-23 09:08 GMT
రష్యాకు ప్రథమ మహిళ లేకుండా పోయింది. ప్రథమ పౌరుడు, అధ్యక్షుడైన పుతిన్ 2013లోనే తన వివాహా బంధాన్ని తెంచుకున్నారు. ఆయన తన భార్య ల్యూడ్మినాకు విడాకులిచ్చాడు. 1983లో ల్యూడ్మినాను పెళ్లి చేసుకున్న పుతిన్ కు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇక విడాకులు తీసుకున్నాక పుతిన్ మాజీ జిమ్మాస్ట్ ప్లేయర్ అయినా అలీనా కబేవాతో సహజీవనం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ దీన్ని పుతిన్ ఖండించారు.

తాజాగా పుతిన్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వార్త రష్యాతోపాటు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పుతిన్ వయసు 66 ఏళ్లు. ఈ లేటు వయసులో పుతిన్ చేసుకోబోయే ఆ మహిళ ఎవరనే దానిపై అందరూ ఆరాతీస్తున్నారు.  అయితే తాజాగా ఓ రష్యాన్ అగ్రశ్రేణి పత్రిక పుతిన్ పెళ్లి చేసుకోబోయేది అలీనా కబేవా అని ప్రకటించడంతో  ఆమె ఎవరా అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు.

అలీనా కబేవా రష్యా పక్కనుండే ఉజ్బెకిస్తాన్ లోని ఓ క్రీడా కుటుంబంలో 1983లో జన్మించారు. కబేవా తండ్రి ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు. మూడేళ్ల వయసు నుంచే కబేవాకు జిమ్మాస్టిక్స్  నేర్పించాడు. 2004లో కబేవా ఏథెన్స్ గేమ్స్ లో బంగారుపతకం సాధించింది. టీనేజ్ వచ్చేసరికి రష్యా తరుఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.  క్రీడా ప్రతిభతో పాటు ఆమె అందంతో రష్యాలో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత కబేవాను వరల్డ్ రిథమిక్ జిమ్మాస్టిక్ చాంపియన్ షిప్ కు అంబాసిడర్ గా రష్యా నియమించింది. అయితే రష్యా జిమ్మాస్ట్ లు డోపింగ్ టెస్ట్ లో బయటపడడంతో కబేవా ఇరుకునపడింది. ఆ తర్వాత జిమ్మాస్టిక్ ను వదిలేసి ఒక మీడియా హౌస్ ను నడిపిస్తూ రష్యా పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది.  2008లో పుతిన్ తో కబేవా కలుసుకోవడం.. ప్రేమాయణం సాగించడం మొదలుపెట్టిందట.. ఈ కారణంగానే 2013లో పుతిన్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడనే వార్తలొచ్చాయి. ఇప్పుడు కబేవాతోనే పుతిన్ పెళ్లికి రెడీ అయినట్టు సమాచారం.

Similar News