అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోవాలంటే ఈ పాట‌లు చూడాలి!

అంగ‌స్తంభ‌న స‌మ‌స్య ఉన్న‌వారు ఈ బాలీవుడ్ పాట చూడాల‌ని అన్నారు.

Update: 2024-12-02 19:30 GMT

ప్ర‌యోగాల‌తో నిరంత‌రం ఆక‌ర్షించే టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ రాత్రిపూట అంగస్తంభన గురించి మాట్లాడారు. ఆశ్చర్యకరంగా అతడు ఫ‌లానా బాలీవుడ్ పాట చూస్తే ఈ స‌మ‌స్య తొల‌గిపోతుంద‌ని సూచించాడు. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య ఉన్న‌వారు ఈ బాలీవుడ్ పాట చూడాల‌ని అన్నారు.

రాత్రిపూట అంగస్తంభనలు.. కార్డియోవాస్కులర్ మ‌రియు లైంగిక ఆరోగ్యానికి `బయోమార్కర్` అని స‌ర‌దాగా వ్యాఖ్యానించిన బిజినెస్ మేన్ జాన్సన్ భార‌తీయ ప్ర‌జ‌ల మైండ్ సెట్ గురించి త‌న‌ అభిప్రాయాన్ని వివరించడానికి ఒక వీడియోను షేర్ చేసారు. అనిల్ కపూర్ - జూహీ చావ్లా నటించిన 1994 బాలీవుడ్ చిత్రం `అందాజ్`లోని `ఖాదా హై` పాట క్లిప్ షేర్ చేస్తూ.. పాట సాహిత్యం గురించి ప్ర‌స్థావించాడు. `ది లోకల్ ట్రైన్`లోని `చూ లో` పాటను కూడా ప్ర‌స్థావించారు బిలియ‌నీర్. ``రాత్రి పూట బెడ్ టైమ్ లో అంగస్తంభనలు `లగాన్` రన్‌టైమ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు...! అని అత‌డు కోట్ చేసాడు. వివాదాస్పద మిలియనీర్ తాను లోదుస్తులు ధరించనని కూడా పేర్కొన్నాడు. రంగు గురించి ప్రజలను రెచ్చగొట్టేలా ప్రశ్నించినందుకు వైరల్ అయిన ఒక మహిళ వీడియోను షేర్ చేస్తూ, ``మెయిన్ చడ్డీ నహీ పెహెంటా (నేను లోదుస్తులు ధరించను) అని చెప్పాడు.

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది దీనిని నమ్మలేకపోయారు. ఒక వ్యక్తి దానిని అగ్రశ్రేణి మార్కెటింగ్ టాక్టిక్స్ అని అన్నాడు. మరొకరు జాన్సన్‌ను ప్ర‌శ్నిస్తూ.. అస‌లు మీకు బాలీవుడ్ పాటలను ఎవరు సూచించారని అడిగారు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని సరదాగా అన్నారు. ``ఒక స్టాండింగ్ ఒవేషన్ అంటే మీరు మాత్ర‌మే అందుకుంటారు`` అని మ‌రొకరు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News