వైసీపీ రెబల్ నాయకుడు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని రఘురామ పిటిషన్ వేశారు.
రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు.
విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ రఘురామ, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడిపై గత మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు. మరో పక్క కానిస్టేబుల్ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. గచ్చిబౌలి పోలీసులు మాట్లాడుతూ... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్ ఫరూక్ విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించగా... ఫరూక్ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసు విభాగం పేర్కొనడం గమనార్హం.
ఇక, పోలీసులు పెట్టిన కేసులు కొట్టేయాలని కోరుతూ.. రఘురామ కోర్టును ఆశ్రయించగా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే అంశాలపై ఆయన తర్జన భర్జన పడుతున్నారు.