నిద్రలో శృంగారం.. కామపిశాచిలా ప్రవర్తిస్తారట.

Update: 2022-10-18 09:31 GMT
నిద్రలో శృంగారం.. కామపిశాచిలా ప్రవర్తిస్తారట.
  • whatsapp icon
శృంగారం దివ్యౌషధం అంటారు. రోజూ శృంగారం చేస్తే జబ్బులే రావంటారు. అయితే మోతాదు వరకూ శృంగారం మంచిదే.. అది దాటితే డేంజర్ అంటున్నారు వైద్యులు. అయితే ఈ సెక్స్ రోగాలు పుట్టుకొస్తున్నాయి. 'సెక్స్ సోమ్మియా' అనే వ్యాధి ఉంటే స్లీప్ సెక్స్ చేస్తుంటారట.. నిద్రలో నడిచినట్టు.. నిద్రలోనే శృంగారం చేస్తారన్న మాట.. నిద్రపోతున్నప్పుడు లేదా మేల్కొనే సమయంలోనే ఈ అనుభవించవచ్చు. సెక్స్ పోమ్మియా విషయంలో వ్యక్తులు హస్తప్రయోగం, లైంగిక కదలికలు, మరొక వ్యక్తితో సెక్స్ ప్రారంభించడం వంటి లైంగిక ప్రవర్తనలలో పాల్గొంటారు. వాళ్లు కళ్లు తెరిచి ఉండొచ్చు. లైంగిక శబ్ధాలు చేసినప్పటికీ సెక్స్ సమయంలో వారు నిద్రపోతారు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఏం జరిగిందో వారికి గుర్తుండదు.

నిద్రలోనే శృంగారం ఏంటని అనుమానిస్తున్నారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ వ్యాధి ఒకటి ఉంది. ఈ వ్యాధిగ్రస్తులు నిద్రలోనే శృంగారంలో పాల్గొంటారు.  ఇంగ్లాండ్‌కు చెందిన ఒక యువతి 'సెక్సోమ్నియా' (Sexsomnia) అనే విచిత్ర వ్యాధితో బాధపడుతోంది. ఈ సమస్య ఉన్నవారు నిద్రలోనే ఒకటికి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటారట. భాగస్వాములను బలవంతం చేస్తారట. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రాత్రి జరిగినవేమీ గుర్తులేకపోవడం ఈ వ్యాధి విచిత్ర లక్షణం.

తాను నిద్రలో కామ పిశాచిలా ప్రవర్తిస్తున్నానని తన ప్రియుడు చెబితే అస్సలు నమ్మలేదని, ఆ తర్వాత తన గురించి తనకు తెలిసి బాధపడుతున్నానని ఈ అమ్మడు చెబుతోంది.

అయితే ఈ రోగం వల్ల తనకు వచ్చిన సమస్య ఏమీ లేదని, కాకపోతే శృంగారంలో పాల్గొన్న అనుభూతి మాత్రం తనకు మిగలడం లేదని ఈమె వాపోతోంది. తన కోసం కాకున్నా ప్రియుడి క్షేమం కోరి ఈ రోగానికి చికిత్స తీసుకుంటోందట ఈ యువతి. ప్రపంచ వ్యాప్తంగా ఈ 'సెక్సోమ్నియా' వ్యాధితో 11 శాతం మంది పురుషులు, 4 శాతం మంది స్త్రీలు బాధపడుతున్నారని సర్వేలో తేలింది.

స్లీవ్ వాకింగ్, స్లీవ్ టాకింగ్ వంటి ఇతర పారా సోమ్మియాలతో పాటు సెక్స్ సోమ్మియా కూడా సంభవిస్తుంది. ఇది స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. సెక్స్ సోమ్మియా ఉన్న మహిళల్లో హస్త ప్రయోగం అనేది అత్యంత సాధారణ ప్రవర్తనగా చెబుతారు.

ఈ అరుదైన జబ్బుకు మందు లేదు. ఈ సమస్య ఉన్నవారు నిద్రలోనే ఒకటికి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటారట. భాగస్వాములను బలవంతం చేస్తారట. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత రాత్రి జరిగినవేమీ గుర్తులేకపోవడం ఈ వ్యాధి విచిత్ర లక్షణం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News