నాన్సెన్ మాటలొద్దంటున్న అసద్

Update: 2015-11-24 15:26 GMT
మత అసహనం మీద ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. తన భార్య కిరణ్ రావ్ దేశం విడిచి వెళ్లాలని చెబుతుందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంటే.. తాజాగా హైదరాబాద్ ఎంపీ.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అమీర్ ఖాన్ నాన్సెన్ మాటలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా నుంచి వెళ్లి పోవాలన్న మాటను మాట వరసకు చెప్పిన అది స్వాతంత్ర్య సమరయోధులకు అపచారం చేసినట్లు అవుతుందని మండిపడ్డారు. దేశాన్ని విడిచి వెళ్లాలంటూ అమీర్ వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సబబు  కాదని చెప్పిన ఆయన.. అమీర్ వ్యాఖ్యలకు సంబంధం లేని మరో వ్యాఖ్యను చేయటం గమనార్హం.

విశ్వంలో భూగ్రహం ఉన్నంత వరకూ మమ్మల్ని ఎవరూ ఇండియా విడిచి వెళ్లిపొమ్మని బలవంతపెట్టలేరని.. తాము కూడా విడిచి వెళ్లమని వ్యాఖ్యానించారు. అయినా.. అసద్ ను  ఎవరు మాత్రం దేశం విడిచి వెళ్లమని చెప్పారు. అమీర్ ఖాన్ వరకు చూస్తే ఆయనకు ఆయన.. తాను దేశాన్ని విడిచిపోవాలని వ్యాఖ్య చేయటం మర్చిపోకూడదు. అమీర్ మాటలు దేశాన్ని ఒకరకంగా అవమానం చేసేలా వ్యాఖ్యలు చేస్తే.. మరోవైపు అసద్ మాటలు అందుకు భిన్నంగా దేశం మీద అభిమానం చూపిస్తున్నట్లుగా ఉంటూనే.. ‘‘తమను దేశం విడిచి వెళ్లమని ఎవరూ చెప్పరు’’ అని వ్యాఖ్యానించటం కాస్తంత చిత్రంగా ఉందనే చెప్పాలి.
Tags:    

Similar News