ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తి - ఆంధ్రుల్లో ఉన్న ప్రత్యేక అభిమానం గురించి మళ్లీ చెప్పనక్కర్లేదు. కానీ ఇపుడు అలాంటి సెంటిమెంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా గోవాలో విజయాన్ని నిర్దేశించింది. దేశంలోనే ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన గోవా రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం మోగింది. 40 స్థానాలున్న అసెంబ్లీకి మార్చి 4వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ-మహారాష్ట్ర వాది గోమంతక్ కూటమి అధికారంలో ఉంది. 2012లో కాంగ్రెస్ తో పోటీపడిన బీజేపీకి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ గట్టి పోటీ ఇవ్వనుంది.
అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని ఆప్ హామీ ఇవ్వడం.. బీజేపీకి మింగుడుపడని విషయంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 2012లో ఆ అంశంపై హామీని ఇచ్చే.. బీజేపీ అధికారం దక్కించుకుంది. ఎన్నికల్లో నెగ్గి సీఎంగా పనిచేసిన మనోహర్ పారికర్ కేంద్రమంత్రి అయ్యాక ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న గోవాకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని గత ఏడాది నవంబర్ లో స్పష్టం చేశారు. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది రాబోయే ఎన్నికల్లో ఫలితాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్విస్ గోమ్స్ ను ఆప్ ప్రకటించింది. జైళ్లశాఖలో ఐజీగా పనిచేసిన నిజాయితీగల పోలీసు ఉన్నతాధికారిగా ఎల్విస్ ప్రజలకు సుపరిచితుడు కావడంతో ఆప్‌కు కలిసివచ్చింది. బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/