ఢిల్లీ పీఠం అప్ దే ...కేజ్రీ తరువాత టార్గెట్ ఇదేనా !

Update: 2020-02-11 14:29 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అప్  హ్యాట్రిక్ విజయం సాధించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ను చిత్తు చిత్తుగా ఓడించి వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న కేజ్రీవాల్ పై  ప్రశంసలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా జరిగిన రాజకీయాన్ని అందరూ చూసేఉంటారు. ఢిల్లీ లో ఈసారి అధికారం మాదే అంటూ బీజేపీ నేతలు తెగ హడావిడి చేసారు. కానీ , కేజ్రీవాల్ దెబ్బకి కమలం వాడిపోయింది. 70 స్థానాలలో పోటీ చేసిన బీజేపీ కేవలం 12 సీట్లని మాత్రమే గెలుచుకుంది.

ఇకపోతే మూడోసారి కూడా ఢిల్లీ లో అధికారాన్ని చేపట్టిన అప్ ..ఢిల్లీ బయట కూడా తన సత్తా చాటాలని చూస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో హర్యానా, పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు బీహార్‌ మీదికి దృష్టి మళ్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రచారం బాగా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఢిల్లీ లో బీజేపీ ని మట్టికరిపించిన కేజ్రీవాల్ ..త్వరలో బీహార్ లో జరగబోయే ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా ఏంటో బీజేపీ కి చూపించాలని ఉవ్విళూరుతున్నట్టు సమాచారం. ఇప్పటినుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల సమయం ఉండడంతో అక్కడ పార్టీని పోటీకి దింపేందుకు గల అవకాశాలను కేజ్రీవాల్ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇకపోతే , బీహార్‌ లో జేడీయూ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన  పవన్ వర్మ, ఢిల్లీకి కాబోయే సీఎం    కేజ్రీవాల్‌ కు పూర్తి మద్దతు తెలుపుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే , అయన మాత్రం ఆమాద్మీ పార్టీతో ఇంకా చర్చించలేదని చెబుతున్నప్పటికీ.. సమయం వచ్చినప్పుడు బీహార్ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై ఆలోచిస్తానని చెప్తున్నారు. ఇదే సమయంలో ఆమాద్మీ పార్టీ పరిపాలనా విధానాలు చాలా బాగున్నాయనీ, లౌకిక సూత్రంపై ఆ పార్టీ ఎనలేని కృషి చేస్తున్నదని , అప్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికలకి ఏడాది కూడా సమయంలోనే ఈ సమయంలో పవన్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆలోజింపజేస్తుంది.  

కాగా , పవన్ వర్మ 2014 ఎన్నికల తరువాత  రెండేళ్ల పాటు  జేడీయూ రాజ్యసభ కి ప్రాతినిధ్యం వహించారు. అలాగే  పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ, జాతీయ ప్రతినిధిగానూ పార్టీకి సేవలు అందించారు. కానీ , కేంద్రం కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన .. సీఏఏ, ఎన్నార్సీలకు జేడీయూ మద్దతు పలకడం తో ఈయన పార్టీ పై అసంతృప్తిని వ్యక్తం చేసి ..సీఎం పైనే విమర్శలు చేయడంతో పార్టీ నుండి బహిష్కరణకు గురైయ్యాడు. దీనితో పవన్ వర్మని కలుపుకొని వచ్చే ఎన్నికలలో బీహార్ లో అప్ ని అధికారంలోకి తీసుకువచ్చేలా క్రేజీవాల్ ప్లాన్ సిద్ధం చేస్తునట్టు తెలుస్తోంది.   


Tags:    

Similar News