జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ఉదంతం అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తాము కిడ్నాప్ చేసిన జవాను రాకేశ్వర్ సింగ్ ను మావోలు వందలాది గిరిజనుల సమక్షంలో విడుదల చేయటం.. దానికి సంబంధించిన వీడియోలు.. పోస్టులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అయ్యాయి. తమ అదుపులో ఉన్న రాకేశ్వర్ సింగ్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టారెందుకు? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది.
రాకేశ్వర్ సింగ్ ను కిడ్నాప్ చేసిన తర్వాత నుంచి.. అతడి విషయంలో మావోలు అనుసరించిన వైనం సానుకూలంగానే ఉందని చెప్పాలి. అతడికి ప్రాణహాని ఉందన్న అంశంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. అందుకు బదులుగా.. తమ మధ్యనే క్షేమంగా ఉన్న ఆయన ఫోటోను విడుదల చేసిన మావోలు.. మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే.. రాకేశ్వర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు.
అనూహ్యంగా గురువారం మధ్యాహ్నం రాకేశ్వర్ సింగ్ ను మావోలు విడుదల చేసినట్లుగా బస్తర్ ఐజీ ప్రకటించి.. అందరిని ఆనందానికి గురి చేశారు. భారీ టెన్షన్ కు ముగింపు పలికారు. ఇంత త్వరగా మావోలు అతన్ని ఎందుకు విడుదల చేసినట్లు? తెర వెనుక ఏం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. సాధారణంగా మావోలు కిడ్నాప్ చేసిన ప్రతిసారీ.. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు ఫెయిల్ అయితే.. మరికొన్నిసార్లు విజయవంతం అవుతుంటారు.
ప్రభుత్వాధికారుల్ని కిడ్నాప్ చేసి.. తమ డిమాండ్లను సాధించుకోవటంలో మావోల ట్రాక్ రికార్డు బాగుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాకేశ్వర్ సింగ్ విడుదల వెనుక ఇలాంటి తెర వెనుక ఒప్పందం ఏదో ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్ ను పక్కన పెట్టేయటం.. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనుల్ని విడుదల చేయాలన్న షరతును పెట్టినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ విడుదల కాకున్నా.. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.