సోష‌ల్ మీడియాలో క‌నిపించే వెంక‌న్న‌కు అభిషేకం

Update: 2017-10-01 06:25 GMT
డిజిట‌ల్ జీవితంలో సోష‌ల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలోని అంశాల మీద ఫోక‌స్ చేసే ఇప్ప‌టి త‌రానికి ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త విష‌యాల మీద ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఈ అల‌వాటును గుర్తించిన కొంద‌రు.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఫేక్ ఫోటోలు.. అస‌త్య స‌మాచారాన్ని అందిస్తుంటారు.

ఈ కార‌ణంతో కొన్నిసార్లు నిజాల్ని కూడా అబ‌ద్ధాలుగా భావించే ప‌రిస్థితి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే వారికి ఒక ఫోటో విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంటుంది. తిరుమ‌ల‌కు వెళ్లే దారిలో ఎత్తైన కొండ మీద స‌హ‌జ సిద్ధంగా ఉండే శిల ఒక‌టి ఒక కోణంలో చూసిన‌ప్పుడు వేంక‌టేశ్వ‌రుని రూపంలో ఉండ‌టం క‌నిపిస్తుంది.  చాలామంది ఈ స‌హ‌జ శిల‌ను.. మార్ఫింగ్ చేసిందిగా భావిస్తుంటారు. అయితే.. ఆ శిల నిజంగా నిజం.

చూసినంత‌నే అబ్బుప‌రిచేలా ఉండే ఈ శిల తిరుమ‌ల‌కు వెళ్లే దారిలో 16వ కిలోమీట‌ర్ వ‌ద్ద ఉంటుంది. తాజాగా త‌మిళ శ‌నివారం పెర‌టాసి నెల సంద‌ర్భంగా ప‌లువురు భ‌క్తులు ఈ శిల‌కు అభిషేకం చేశారు. పాలు.. పెరుగు.. తేనె.. ప‌సుపు.. కుంకుమ‌.. ప‌న్నీర్ తో పాటు వివిధ సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం.. 30 అడుగుల పొడ‌వున్న తుల‌సి మాల‌ను వేశారు. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన తుల‌సి మాల‌తో.. స్వామి వారి స‌హ‌జ శిల  అంద‌రిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News