ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఒక సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు - ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయన్న దానిపై సర్వే చేసి అంచనాలు ప్రసారం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి 120 సీట్లు వస్తాయట. వైసీపీకి 50 సీట్లు వస్తాయని చెబుతోంది. ఓట్ల శాతం చూస్తే టీడీపీకి 46.53 శాతం - వైసీపీకి 36. 80 శాతం వస్తాయంటోంది. కాంగ్రెస్ కు 6.10 శాతం ఓట్లు వస్తాయట. వామపక్షాలకు 2.9 శాతం ఓట్లు పడతాయని వెల్లడించింది.
ఒకవేళ బీజేపీ - టీడీపీ - పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విడిపోయి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా సర్వే ఫలితాల్లో ఉంది. జనసేనకు కనీసం పోటీ ఇచ్చే స్థాయి కూడా లేదని తేల్చింది. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ పార్టీకి కేవలం 3.86 శాతం ఓట్లు మాత్రమే వస్తాయట.
అంతేకాదు... టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే సూపర్ మెజారిటీ సాధ్యమవుతుందని ఈ సర్వేలో వెల్లడించారు. ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తే 140 స్థానాలు వస్తాయట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/