ఓటుకు నోటు వ్వవహారం కొత్త మలుపు తీసుకునేటట్లు కనిపిస్తోంది. తెలంగాణ అధికారపక్షం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో లంగదీసుకొని.. తమకు నచ్చిన రీతిలో ఓటు వేయాలన్న కుట్రకు సంబంధించిన కేసు కొత్త రూపు దిద్దుకునేటట్లు కనిపిస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారం కంటే సీరియస్ అయిన.. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసుగా రూపు మార్చుకోనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని స్టీఫెన్‌సన్‌తో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్లుగా చెప్పినా.. వాస్తవానికి ఆ సంఖ్య దాదాపు 29 మంది వరకు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఐదుగురు ఎమ్మెల్యేలతో దాదాపు 23 సార్లు మాట్లాడిన ఆధారాలు ఉన్నాయన్న వాదన వ్యక్తమవుతోంది.
సండ్ర వెంకట వీరయ్య కాల్‌డేటాతో ఈ అంశానికి సంబంధించి ఒక నిర్దారణకు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కోణంలో తమ విచారణను ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా మారిన కోణంలో ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు అధికారుల వైఖరి ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. 29 మంది ఎమ్మెల్యేల్ని కాంటాక్ట్ చేసినట్లుగా చెబుతున్న వాదనకు తగిన ఆధారాలు.. గతంలో మాదిరి మీడియాకు లీక్ అవుతాయో లేదో చూడాలి.