ఓటుకు నోటు వ్యవహారంలో అత్యంత కీలకమైన రూ.50 లక్షల విషయంపై ఏసీబీ అధికారులు ఎంతగా బుర్ర బద్ధలు కొట్టుకున్నా సమాచారం లభించని పరిస్థితి. ఓటుకు నోటు ఇష్యూలో పక్కాగా ఫిక్స్ చేసే విషయంలో సూపర్ డూపర్ గా సక్సెస్ అయిన తెలంగాణ ఏసీబీ.. ఈ కేసులో అత్యంత కీలకమైన రూ.50లక్షల మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ మొత్తాన్ని ఎవరు సమకూర్చారు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేని పరిస్థితి.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు బ్యాగులో ఆఫర్ చేసిన రూ.50 లక్షలకు సంబంధించిన మొత్తం ఎవరు సమకూర్చారన్న దానిపై ఈ కేసు ఎంతోకొంత ప్రభావం చూపించటం ఖాయం. ఈ నేపథ్యంలో.. రూ.50లక్షలు సర్దుబాటు చేసిన వారి గురించి ఆధారాలు సేకరించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నా.. ఫలితం ఉండటం లేదన్న వాదన వినిపించటం తెలిసిందే.
అయితే.. ఈ సస్పెన్స్ కు తెర దించుతూ.. చివరకు రూ.50 లక్షల మొత్తానికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి సమకూర్చినట్లుగా చెబుతున్నారు.
ఈ మొత్తాన్ని మాజీ ఎంపీ.. దివంగత పారిశ్రామికవేత్త ఆదికేశవుల నాయుడు కుమారుడు శ్రీనివాసనాయుడు సమకూర్చి ఉంటారని భావిస్తున్నారు. ధీనికి సంబంధించిన ఆధారాల్ని తాము సేకరించినట్లుగా తెలంగాణ ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
తాజాగా డీకే శ్రీనివాస్ (దింగత ఆదికేశవనాయుడి కుమారుడు.. కర్ణాటక బేవరేజస్ అండ్ డిస్టలరీస్ ఎండీ)..
ఆయన సన్నిహితుడు విష్ణుచైతన్యకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దివంగత మాజీ ఎంపీ ఆదికేశవుల నాయుడు మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నా.. వైఎస్ హయాంలో పార్టీ మారిన ఆయన.. వైఎస్ మరణం తర్వాత మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపారు.
2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఆదికేశవుల నాయుడు మరణించారు. దీంతో.. ఆయన సతీమణి సత్యప్రభకు చిత్తురు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్టు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే నోటీసులు ఇచ్చినట్లుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మరి.. సేకరించిన ఆధారాలు ఎంతవరకు నిజం అన్నది విచారణలో తేలాల్సి ఉంది.