తెలుగుదేశంపార్టీకి పిచ్చి బాగా ముదిరిపోయినట్లే ఉంది. వైసీపీ అంతర్గత వ్యవహారంలో టీడీపీ విపరీతంగా జోక్యం చేసుకోవటమే ఇందుకు నిదర్శనం. ఆర్మీ ఆసుపత్రిలోని డాక్టర్లిచ్చిన నివేదికలో లేని అంశాలు నివేదికలో ఉన్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా మాక్ అసెంబ్లీ నిర్వహించిన టీడీపీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు చేసిన పరీక్షలను జడ్జీ చదివి వినిపించారు.
ఈ సందర్భంగా ఎంపి కాలికి గాయాలున్నాయన్నారు. అలాగే ఎంపికి జనరల్ ఎడీమా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్పిన విషయాన్ని తేల్చారు. ఎడమకాలి బొటనవేలికి పక్క వేలిపై గాయముందని నివేదికలో చెప్పినట్లు జడ్జి చెప్పారు. మొత్తం నివేదికలో పోలీసులు కొట్టడం వల్లే ఎంపికి గాయాలైనట్లు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. గుంటూరు మెడికల్ బోర్డు నివేదికను కొట్టేయలేదు. అలాగే ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదికను నిర్ధారించనూలేదు.
ఎంపి కాలికి గాయముందని సీఐడీ తరపు లాయర్ దుష్యంత్ దవే కూడా కాదనలేదు. కాకపోతే ఆ గాయాలు పోలీసులు కొట్టినవి కావని మాత్రమే వాదించారు. ఎంపి తరపు లాయర్ కాబట్టి రోహిద్గీ వాదిస్తు ఎంపిని పోలీసులు కొట్టారని ఆరోపించారు. నిజానికి రెండువైపులా వాదనలు విన్న తర్వాత జడ్జీ కూడా గాయాల విషయంలో ఎలాంటి నిర్ధారణ చేయలేదు. వాస్తవం ఇలాగుంటే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం పోలీసులు కొట్టడం వల్లే ఎంపికి గాయాలైనట్లు నిర్ధారణయ్యిందని నివేదికలో ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా ఎంపిని పోలీసులు కొట్టడాన్ని జగన్ లైవ్ లో చూశారని అచ్చెన్న చెప్పటం మరీ విడ్డూరం.
పైగా పోలీసు అధికారుల సమక్షంలోనే పోలీసులతో ఎంపిని కొట్టించినట్లు తేలిపోయిందంటు నానా గోల చేశారు. కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చినందుకు వెంటనే జగన్ అరెస్టు చేయాలంటు డిమాండ్ చేశారు. పోలీసులు కొట్టడం వల్లే ఎంపికి దెబ్బలు తగిలిందని జడ్జీనే చెప్పనపుడు అచ్చెన్న ఎలా చెప్పేస్తారు ? పైగా జూమ్ యాప్ లో జగన్ రాజీనామాపై పదే పదే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు గట్టిగా నినాదాలివ్వటం ఇంకా విచిత్రం. వీళ్ళు చేసే డిమాండ్లేమన్నా మామూలు జనాలుకు లేకపోతే జగన్ కు వినబడుతుందా.
అన్నింటికన్నా విచిత్రమేమిటంటే రఘురామ వివాదంలో చంద్రబాబునాయుడు నుండి క్రిందిస్ధాయి నేతవరకు విపరీతమైన ఆసక్తి చూపటం. అసలు రఘురామకు టీడీపీకి ఎలాంటి సంబంధంలేదు. ఎంపి గెలిచింది వైసీపీ తరపున. గెలిచిన తర్వాత జగన్ తో పడని కారణంగా పార్టీకి, జగన్ కు ఎంపి దూరమయ్యారు. వాళ్ళమధ్య వివాదం ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు. మధ్యలో చంద్రబాబు అండ్ కో ఎందుకు ఓవర్ గా రియాక్టవుతున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు.