ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు గట్టి షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్న సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో అచ్చెన్న సోదరుడు కుమారుడు వైసీపీ తరుఫున పోటీచేయడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదు.
పంచాయతీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్న బరిలో నిలపడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారని ప్రచారం జరుగుతోంది.. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్ వేయొద్దని.. ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేశారని నియోజకవర్గంలో అనుకుంటున్నారు.
అప్పటికీ అప్పన్న తన బాబాయ్ అయిన అచ్చెన్న మాట వినకపోవడంతో ఇక అచ్చెన్న అనుచరులు ఏకంగా ఆయన నివాసానికి చేరుకొని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు..
అయితే టీడీపీ ప్రభుత్వం తప్పిదాల వల్ల తన భార్య ఉద్యోగం కోల్పోయిందని.. నిమ్మాడలో అస్సలు పట్టించుకోని టీడీపీ తరుఫున తాను నిలబడడని అప్పన్న పేర్కొన్నాడు. వైసీపీ నుంచి సర్పంచ్ గా నామినేషన్ వేసి తీరుతానని స్పష్టం చేశాడు.
అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడి అనుచరులు అడ్డుకున్నారని సమాచారం.. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆదివారం నామినేషన్ కేంద్రానికి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ కూడా ఉన్నారని అంటున్నారు.
నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి అప్పన్నను బలవంతంగా బయటకు గెంటేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. నిమ్మాడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.